rameshbabu
November 13, 2021 SLIDER, TELANGANA
434
నీలోఫర్ ఆసుపత్రిలో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఐసీయీ వార్డును ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. హైసీయా , నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయం అన్నారు…తెలంగాణ ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నదన్నారు. సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి గారు …
Read More »
rameshbabu
November 13, 2021 SLIDER, SPORTS
875
టీమిండియా వన్డే కెప్టెన్ కోహ్లి భవిష్యత్తుపై చర్చలు జరపాలని బీసీసీఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ భారం తగ్గించి అతడు బ్యాటింగ్ పై దృష్టిపెట్టేందుకే బీసీసీఐ ఈ ఆలోచన చేస్తోందట. ఈ మేరకు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందే కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని బీసీసీఐ కోరనుందట. కోహ్లి ఇప్పటికే 3 టీ 20 కెప్టెన్ తప్పుకున్నాడు.
Read More »
rameshbabu
November 13, 2021 LIFE STYLE, SLIDER
1,114
నూనె అధికంగా ఉన్న టిఫిన్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. తక్కువ ఆయిల్ వాడి, తృప్తిగా తినగలిగే టిఫిన్లను ఎంచుకోవాలి. పోహా (నానబెట్టిన అటుకులు) చాలా హెల్తీ. దీని వల్ల శరీరానికి కావాల్సిన క్యాలరీలు అందుతాయి. ఎగ్స్.. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. అరటి పళ్లలో ఫైబర్, క్యాలరీలు అధికంగా ఉంటాయి. నేరుగా అరటిని తినడానికి ఇష్టపడని వారు స్మూతీ చేసుకోవచ్చు. వీటితో పాటు మొలకెత్తిన గింజలు కూడా చాలా మంచివి.
Read More »
rameshbabu
November 13, 2021 ANDHRAPRADESH, SLIDER
1,115
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గా ప.గో. జిల్లాకు చెందిన గా ఎమ్మెల్సీ మోషేను రాజు ఎంపిక కానున్నట్లు సమాచారం. ఆయనకే ఎక్కువ అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మోషేను రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీ, రాజమండ్రి లోకసభ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇక డిప్యూటీ ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై క్లారిటీ లేదు.
Read More »
rameshbabu
November 13, 2021 NATIONAL, SLIDER
948
దేశంలో కొత్త వైరస్ ‘నోరో’ చాప కింద నీరులా విస్తరిస్తోంది. US శాస్త్రవేత్తల ప్రకారం.. వాంతులు, డయేరియా, వికారం, కడుపునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి దీని లక్షణాలు. ఇక కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం, వైరస్ సోకిన వారి నుంచి నోరో వ్యాపిస్తుంది. కాగా ఇప్పటికే కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇది ఒకరి నుంచి …
Read More »
rameshbabu
November 13, 2021 SLIDER, TELANGANA
436
తెలంగాణ రాష్ట్రంలోని 4 మండలాల్లో దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ మండలాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. చింతకాని మండలానికి రూ.100 కోట్లు, మిగతా 3 మండలాలకు రూ.50 కోట్ల చొప్పున ఇచ్చింది. ఇప్పటికే ఆయా మండలాల్లో దళిత బంధు ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్లు అవగాహన సదస్సులు నిర్వహించారు.
Read More »
rameshbabu
November 12, 2021 SLIDER, TELANGANA
487
కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదు. మా సమస్య.. మా నీళ్లు మాకు దక్కాలి.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు నియామకాల మీద. నీళ్ల విషయంలో ఏడేండ్ల నుంచి కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదు అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అక్రమంగా ఏపీ ప్రభుత్వం పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను తీసుకెళ్తుంది. కృస్ణా జలాల్లో మాకు న్యాయమైన వాటా రావడం లేదు. కృష్ణా బేసిన్‌లో …
Read More »
rameshbabu
November 12, 2021 SLIDER, SPORTS
970
T20 ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండు పెద్ద షాక్ తగిలింది. కివీస్ వికెట్ కీపర్ Batsmen డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో స్టంప్ ఔటైన తర్వాత కాన్వే చేతితో బ్యాట్ ను గట్టిగా గుద్దాడు. దీంతో అతని అరచేతి ఎముక విరిగింది. ఫలితంగా అతను ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్తో పాటు ఇండియా టూరూ దూరమయ్యాడు. ఇప్పటికే ఆ జట్టు పేసర్ …
Read More »
rameshbabu
November 12, 2021 ANDHRAPRADESH, SLIDER
1,084
ఏపీ అధికార వైసీపీపై టీడీపీ నేత,మాజీ మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన.. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని, తమపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయట తిరగగలరా అని విమర్శించారు. తన నాన్న కాస్త సాఫ్ట్ కానీ.. తాను అలా కాదని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో వచ్చే ప్రజా ఉద్యమంలో జగన్ కొట్టుకుపోతాడని లోకేశ్ హెచ్చరించారు.
Read More »
rameshbabu
November 12, 2021 NATIONAL, SLIDER
725
కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకునే అర్హత కలిగి ఉండి, ఇప్పటి వరకు మొదటి, రెండో డోస్ తీసుకోని వారిపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వారికి పబ్లిక్ ప్లేస్ కి అనుమతి నిషేధించింది. బస్సుల్లో ఎక్కడానికి అనుమతి లేదని ప్రకటించింది. వివిధ ప్రదేశాల్లోకి ప్రవేశించే ముందు కోవిడ్ సర్టిఫికేట్ తనిఖీ చేస్తామని తెలిపింది.
Read More »