rameshbabu
September 13, 2021 ANDHRAPRADESH, SLIDER
1,023
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్ మారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వైసీపీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరిన లోకేశ్.. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.
Read More »
rameshbabu
September 13, 2021 NATIONAL, SLIDER
706
యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటిస్తారా..?. వచ్చేడాది చివరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ CM అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రాను ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో బరిలో దిగనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. అయితే, దీనిపై ఇంకా స్పష్టత లేదన్నారు. పార్టీ కోసం ప్రియాంక ఎంతో శ్రమిస్తున్నారని ఖుర్షీద్ చెప్పారు.
Read More »
rameshbabu
September 13, 2021 SLIDER, SPORTS
830
జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2004లో అరంగేట్రం చేసిన బ్రెండన్ టేలర్.. ఆ తర్వాత జింబాబ్వే స్టార్ బ్యాట్స్మన్గా ఎదిగాడు. తన కెరీర్లో 34 టెస్టులు, 204 వన్డేలు, 45 టీ 20లు ఆడాడు. వన్డేల్లో జింబాబ్వే తరపున 6,677 పరుగులు చేశాడు. జింబాబ్వే తరపున ఇదే రెండో అత్యధికం.
Read More »
rameshbabu
September 13, 2021 SLIDER, SPORTS
986
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను రోహితక్కు అప్పగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విరాట్ కోహ్లి త్వరలో స్వయంగా ప్రకటన చేస్తాడని చెప్పాయి. తన బ్యాటింగ్పై దృష్టి సారించేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read More »
rameshbabu
September 13, 2021 MOVIES, SLIDER
648
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో నాగ చైతన్య- అందాల రాక్షసి సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లవ్‌స్టోరీ’. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వినాయక చవితికి విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడింది. సెప్టెంబర్ 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.ఈ చిత్రం …
Read More »
rameshbabu
September 13, 2021 MOVIES, SLIDER
619
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగా ఎంత ఎదిగారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న రామ్ చరణ్ త్వరలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ రెండు సినిమాలు థియేటర్ సమస్యలన వలన ఆగిపోయాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తుండగా, ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది.చరణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగాను సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు సరికొత్తగా …
Read More »
rameshbabu
September 13, 2021 SLIDER, TELANGANA
530
సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట అర్భన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు , ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ దేవునూరి తిరుపతి నిన్న అనారోగ్యంతో మృతి చెందారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మందపల్లి లో తిరుపతి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు.. ఆయన మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక మంచి …
Read More »
rameshbabu
September 13, 2021 SLIDER, TELANGANA
413
కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని చెప్పిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, తెలంగాణలో రైతులు ఇకముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రగతిభవన్ లో జరిగిన వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్ లో …
Read More »
rameshbabu
September 13, 2021 SLIDER, TELANGANA
716
కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున.. మన రాష్ట్రానికి కూడా సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్ లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి …
Read More »
rameshbabu
September 13, 2021 MOVIES, SLIDER
618
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఉత్తేజ్ భార్య పద్మావతి అనారోగ్యంతో కన్నుమూశారు. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఉత్తేజ్ కి చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె కీలకంగా వ్యవహరించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉత్తేజ్- పద్మావతి దంపతులకు చేతన, పాట అనే ఇద్దరు పిల్లలున్నారు.
Read More »