Home / MOVIES / డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చ‌ర‌ణ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చ‌ర‌ణ్

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టుడిగా ఎంత ఎదిగారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న రామ్ చ‌ర‌ణ్ త్వ‌ర‌లో ఆచార్య‌, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించ‌నున్నాడు. ఈ రెండు సినిమాలు థియేట‌ర్ స‌మ‌స్య‌ల‌న వ‌ల‌న ఆగిపోయాయి.

ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది.చ‌ర‌ణ్ న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గాను స‌త్తా చాటుతున్నారు.

అయితే ఇప్పుడు సరికొత్తగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినట్లు తెలుస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు రామ్ చరణ్ భారీ మొత్తం డిమాండ్ చేయగా, అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తమ సంస్థ‌కు చ‌ర‌ణ్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండ‌డంపై స‌ద‌రు సంస్థ కూడా సంతోషం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తుంది.