Home / MOVIES / దుమ్ము లేపుతున్న ‘లవ్‌స్టోరీ’ Trailler

దుమ్ము లేపుతున్న ‘లవ్‌స్టోరీ’ Trailler

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో నాగ చైతన్య- అందాల రాక్షసి  సాయి పల్లవి జంటగా, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘లవ్‌స్టోరీ’. ఫిదా త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల నుండి వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

వినాయ‌క చ‌వితికి విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. సెప్టెంబర్‌ 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన ‘లవ్‌స్టోరీ’ టీజర్‌, ‘సారంగ దరియా’ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సారంగద‌రియా పాట అయితే అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఇక తాజాగా చిత్ర ట్రైలర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. సున్నితమైన ప్రేమ కథతో శేఖర్ కమ్ముల మరోసారి హృదయాన్ని తాకేలా సినిమాని తెర‌కెక్కించినట్టు ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది.