rameshbabu
July 4, 2021 ANDHRAPRADESH, SLIDER
1,228
ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో మృతి చెందగా.. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలియజేశారు. ‘రామచంద్రారెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడిన నేత. ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులకు నా సానుభూతి’ అని వెంకయ్యనాయుడు అన్నారు. అటు సోమువీర్రాజు కూడా సంతాపం తెలియజేశారు.
Read More »
rameshbabu
July 4, 2021 SLIDER, TELANGANA
641
కృష్ణా జలాలను వృథా చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలంగాణ రాష్ట్ర సీఎం అన్నారు. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ఏపీ వాడుకోవచ్చని.. తెలంగాణకు కేటాయించిన నీటితోనే విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్.. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి గోస తీరిందని, రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల వల్ల జల విద్యుత్ అవసరం పెరిగిందన్నారు.
Read More »
rameshbabu
July 4, 2021 SLIDER, TELANGANA
548
కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని.. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని మండిపడ్డారు. ఎన్జీటీ స్టే విధించినా నిర్మాణాలను ఏపీ ఆపడం లేదని.. ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని సీఎం తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఒప్పుకునేది లేదన్నారు.
Read More »
rameshbabu
July 4, 2021 SLIDER, TELANGANA
441
రానున్న దసరా వరకు సిరిసిల్ల- వేములవాడలో అందరికీ రూపాయికే నల్లా కనెక్షన్ విధానంలో తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే దీనికోసం 60శాతం పనులు పూర్తి చేశామన్నారు. స్థానిక మార్కెట్ నిర్మాణం కోసం రూ.5కోట్లు మంజూరు చేశామన్నారు. కమ్యూనిటీ మహిళా భవనానికి రూ. 20లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ప్రజలంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్నారు..
Read More »
rameshbabu
July 4, 2021 SLIDER, SPORTS
1,137
భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (38) ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్ (అన్ని ఫార్మాట్లు)లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఘనత సాధించింది. ఇంగ్లాండ్ తో చివరి వన్డే ద్వారా మిథాలీ ఈ ఫీట్ అందుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ ఎడ్వర్డ్స్ (10,273 రన్స్) పేరు మీద ఉండేది. భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో 10 వేల రన్స్ చేసిన ఏకైక …
Read More »
rameshbabu
July 4, 2021 SLIDER, SPORTS
1,100
ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. వర్షం వల్ల ఒక్కో ఇన్నింగ్స్ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత ఇంగ్లాండ్ జట్టు మొత్తం వికెట్లను కోల్పోయి 219/10 రన్స్ చేసింది. లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన భారత్ 46.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిథాలీ రాజ్ (75*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఇండియాను గెలిపించింది. స్మృతి మందాన (49) రాణించింది. 3 …
Read More »
rameshbabu
July 4, 2021 LIFE STYLE, SLIDER
843
బొప్పాయి ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణకు ఔషధంలా పనిచేస్తుంది. చర్మం పొడిబారకుండా బొప్పాయి ఫేస్ప్యాక్ వేసుకోండి. బొప్పాయి గుజ్జులో అరటిపండు గుజ్జు, తేనే కలిపి మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కోండి. ఇలా చేయడం వల్ల బొప్పాయిలోని ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని సాగకుండా కాపాడి.. కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.
Read More »
rameshbabu
July 4, 2021 CRIME, HYDERBAAD, SLIDER, TELANGANA
2,383
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. మృతులు ఖమరుద్దీన్, జమీల్, బబ్లూగా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ కాగా.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Read More »
rameshbabu
July 4, 2021 NATIONAL, SLIDER
812
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 43,071 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో 955 మంది కరోనా కారణంగా మరణించారు. మరోవైపు ఇదే సమయంలో కరోనా నుంచి 52,299 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య: 3,05,45,433 మరణాలు: 4,02,005 కోలుకున్నవారు: 2,96,58,078 యాక్టివ్ కేసులు: 4,85,350
Read More »
rameshbabu
July 4, 2021 NATIONAL, SLIDER
917
వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం కల్పిస్తోంది. పీఎం కిసాన్ FPO యోజన పథకం ద్వారా రైతులు అగ్రికల్చర్ బిజినెస్ ప్రారంభించడానికి కేంద్రం రూ. 15లక్షలు అందించనుంది. ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవడానికి 11 మంది రైతులు ఒక సంస్థను ఏర్పాటు చేసి.. దానిని కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. త్వరలోనే ఈ పథకం రిజిస్ట్రేషన్, విధివిధానాలను కేంద్రం ప్రకటించనుంది.
Read More »