కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని.. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని మండిపడ్డారు.
ఎన్జీటీ స్టే విధించినా నిర్మాణాలను ఏపీ ఆపడం లేదని.. ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని సీఎం తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఒప్పుకునేది లేదన్నారు.