తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 29 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 80,878 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు
Read More »TimeLine Layout
March, 2021
-
3 March
ధోనీ రికార్డును విరాట్ బద్దలు కొడతాడా..?
టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు అత్యధికంగా 60 టెస్టులకు కెప్టెన్ గా ఉండగా నాలుగో టెస్టుతో విరాట్ దీన్ని సమం చేస్తాడు. మరో 17 రన్స్ చేస్తే కెప్టెన్ గా 12వేల రన్స్ చేసిన ఘనత పొందుతాడు. ఇతడి కంటే ముందు పాంటింగ్, గ్రేమ్ స్మిత్ ఉన్నారు. ఈ టెస్టులో సెంచరీ చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి అధిక సెంచరీలు చేసిన పాంటింగ్ (41)ని …
Read More » -
3 March
బుమ్రాపై యువరాజ్ ట్రోలింగ్
టీమిండియా పేసర్ జస్పీత్ బుమ్రాను.. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్రోల్ చేశాడు. బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం, అదే టైంలో స్టైలిష్ ఫొటోను అతడు ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆలోచిస్తున్నట్లు ఎమోజీ పెట్టడంపై యువీ స్పందించాడు. ‘ఫస్ట్ మాప్ పెట్టాలా, స్వీప్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు’ అని అన్నాడు. ఇప్పటికే ENGతో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రా.. ఆ జట్టుతో T20, వన్డే సిరీస్లు ఆడడని తెలుస్తోంది
Read More » -
3 March
బంగారం ప్రియులకు శుభవార్త
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.1,040 తగ్గి రూ 45,930గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.950 తగ్గి రూ.42,100గా ఉంది. అటు వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.72,000గా ఉంది
Read More » -
3 March
తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు
తెలంగాణలో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు పెరిగాయి. అత్యధికంగా సంగారెడ్డిలో 8.12 మీ., అత్యల్పంగా కరీంనగర్ జిల్లాలో (0.10 మీ.). పెరిగాయంది. ఇక 5 జిల్లాల్లో తగ్గుదల కన్పించిందని వెల్లడించింది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 0.82 మీటర్లు తగ్గింది. సంగారెడ్డి, నిజామాబాద్ (తూర్పు), మెదక్, సిద్దిపేట, భద్రాద్రి నిర్మల్, కామారెడ్డి, వికారాబాద్ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువ లోతుకెళ్తేనే నీటి జాడ ఉంటోంది.
Read More » -
3 March
ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్
ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. రేపల్లెలో ప్రతిరోజూ రాత్రి 10.40కు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7.05కు కాచిగూడ చేరుతుంది. కాచిగూడలో రాత్రి 10.10కి బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 5.50కు రేపల్లె చేరుతుంది. ఈ రైలు పల్లెకోన, భట్టిప్రోలు, వేమూరు, చినరావూరు, తెనాలి, వేజండ్ల, గుంటూరు, బీబీనగర్ ఘట్ కేసర్, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది
Read More » -
3 March
దేశంలో కొత్తగా 14,989 మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,989 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516కు చేరింది. అటు నిన్న 98 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. ఇక నిన్న కరోనా నుంచి13,123 మంది కోలుకోగా ప్రస్తుతం దేశంలో 1,70,126 యాక్టివ్ కేసులున్నాయి…
Read More » -
3 March
ఢిల్లీకి సీఎం జగన్ .. అందుకేనా..?
ఏపీ ముఖ్యమంత్రి అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. విశాఖ స్టీల్ పై ప్రజల్లో ఉన్న మనోభావాలను సీఎం ఇద్దరు నేతలకూ తెలియజేయనున్నారు
Read More » -
2 March
మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకోబోతున్నారా..?. అయితే ఇది మీకోసమే..?
సాధారణంగా కరోనా వైరస్ నిరోధానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లన్నీ రెండు డోసులుగా తీసుకునేవే. అయితే తొలిసారి కేవలం ఒక డోసుతోనే సమర్థంగా పనిచేసే టీకాను జాన్సన్ అండ్ జాన్సన్ అనే అమెరికా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెరికాలో టీకా అత్యవసర వినియోగానికి FDA విభాగం ఆమోదముద్ర వేసింది. మూడు ఖండాల్లో ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేశామని, టీకా 85% రక్షణ కల్పిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది.
Read More » -
2 March
నేనేమి మాట్లాడిన దేశం కోసమే-కంగనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీని టార్గెట్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాను షాడో బ్యాన్ చేయడంతో కంగనా స్పందించింది. ‘జాక్ చాచా భావవ్యక్తీకరణ చేసినందుకు నా ఖాతాను షాడో బ్యాన్ చేశారు. నన్ను చూసి భయపడుతున్నారు. నన్ను బ్యాన్ చేయలేరు. ఫాలోయర్లను పెంచుకోవడానికో, నన్ను నేను ప్రమోట్ చేసుకునేందుకో ఇక్కడ లేను. నేను ఏది మాట్లాడినా దేశం కోసమే. దాన్ని సహించలేకపోతున్నారు అని ట్వీట్ …
Read More »