ఏపీ ముఖ్యమంత్రి అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు.
స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. విశాఖ స్టీల్ పై ప్రజల్లో ఉన్న మనోభావాలను సీఎం ఇద్దరు నేతలకూ తెలియజేయనున్నారు