ప్రభాస్ హీరోగా నటించనున్న ‘సలార్’లో హీరోయిన్ పై కొత్త వార్త విన్పిస్తోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్లను కాకుండా కొత్త హీరోయిన్ లు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిక్సయ్యాడట. కథానుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మోడల్స్ వివరాలను ఆయన పరిశీలిస్తున్నాడట.
Read More »TimeLine Layout
January, 2021
-
23 January
మీ దగ్గర పాత రూ.100 నోట్లు ఉన్నాయా..?
ఈ ఏడాది మార్చి నుంచి పాత రూ.100 నోట్లను ఉపసంహరించనున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది కొత్త రూ. 100 నోట్లు మాత్రమే చలామణీలో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. పాత సిరీస్ నోట్లలో నకిలీ నోట్లు అధికంగా ఉన్నట్లు RBI వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలోనే ఆ నోట్లను రద్దు చేస్తున్నారు. అటు ఇప్పటికే పాత సిరీస్ నోట్ల ముద్రణను 6 నెలలుగా బ్యాంకు ఆపేసింది.
Read More » -
23 January
ఆ హీరోతో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఢీల్.. ఏంటో తెలుసా.?
తెలుగు, హిందీతోపాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం చకచకా సినిమా షూటింగ్‌లకు హాజరవుతోంది. తాజాగా తమిళంలో `అయలాన్` షూటింగ్‌ను కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రకుల్.. శివ కార్తికేయన్ గురించి మాట్లాడింది. `శివ కార్తికేయన్‌తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేశా. ఆయన చాలా మంచి నటుడు. తమిళంలో …
Read More » -
23 January
జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిని నియమించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక …
Read More » -
23 January
టీఆర్ఎస్ లోకి వలసలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని ఆర్మూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు
Read More » -
23 January
మంత్రి కేటీఆర్ సీఎం కావాలని…!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుతూ మంచిర్యాలకు చెందిన టీఆర్‌ఎస్ యూత్ విభాగం నాయకులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకు న్నారు. శుక్రవారం అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు కాలినడక ప్రారంభించారు. కేటీఆర్‌ను సీఎంగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకోసమే స్వామికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లినట్టు వారు పేర్కొన్నారు. తిరుమల వెళ్లినవారిలో టీఆర్‌ఎస్ యూత్ …
Read More » -
23 January
నవతరం నేత.. నవ్యతకు బాట “కేటీఆర్”
పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతికరంగాల్లో ఆయనది ఒక నవశకం. తెలంగాణ ఆధునిక విప్లవ ప్రగతి ఫలాలను అందరికి అందిస్తున్నారు. సుధీర్ఘ రాజకీయ, పాలనానుభవం కలిగిన ఎంతోమంది పాలకుల వల్ల కానిది కేవలం ఆరేండ్ల కాలంలోనే చేసి చూపించారు. యావత్ దేశానికే ఒక మార్గదర్శిగా నిలిచిన యువనేత తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్ర పారిశ్రామికరంగ అభివృద్ధికి నిత్యం కృషిచేస్తూ టీఎస్- ఐపాస్, వి-పాస్, వంటి వినూత్న పథకాల …
Read More » -
22 January
పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రెండేండ్ల కింద నారాయణగూడలో ఐపీఎం ప్రారంభించుకున్నాము. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రక్త పరీక్షలు, మూత్ర …
Read More » -
22 January
తెలంగాణలో రేషన్ పంపిణీలో సరికొత్త విధానం
కరోనా వ్యాప్తి తగ్గేంతవరకు OTP, ఐరిస్ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చౌక ధరల దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రాన్ని వినియోగించడం ద్వారా వైరస్ ప్రబలే అవకాశముందన్న.. హైకోర్టు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 1నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది ఈ విషయమై మార్గదర్శకాలు జారీచేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ కలెక్టర్లకు సూచించారు.
Read More » -
22 January
రష్మిక అభిమానులకు బ్యాడ్ న్యూస్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి చిత్రం నుంచి క్యూట్ బ్యూటీ రష్మిక తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ మూవీలో హీరోయిన్ గా నటించమని చిత్ర బృందం ఆమెను సంప్రదించిందట. అయితే రష్మిక రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో యూనిట్ వెనకడుగు వేశారని తెలుస్తోంది. ఆమె స్థానంలో ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న అప్ కమింగ్ భామ ప్రియాంక మోహన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం
Read More »