Home / SLIDER / మంత్రి కేటీఆర్‌ సీఎం కావాలని…!

మంత్రి కేటీఆర్‌ సీఎం కావాలని…!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుతూ మంచిర్యాలకు చెందిన టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం నాయకులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకు న్నారు.

శుక్రవారం అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు కాలినడక ప్రారంభించారు. కేటీఆర్‌ను సీఎంగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకోసమే స్వామికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లినట్టు వారు పేర్కొన్నారు. తిరుమల వెళ్లినవారిలో టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, అశోక్‌తేజ, పవన్‌, సాయికుమార్‌, శ్రావణ్‌ ఉన్నారు.