TimeLine Layout

October, 2021

  • 16 October

    ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ లో దాతలు పొన్నాల కిష్టమ్మ వీరయ్య గారు (రూ.10 లక్షలు), ఎంఎన్ రెడ్డి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సందిరి గోవర్ధన్ రెడ్డి గారు (రూ.3.50 లక్షలు), ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు (రూ.2 లక్షలు), బిజెపి నేత భరత్ సింహా రెడ్డి గారు (రూ.1.70 లక్షలు) మరియు ఇతర దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన పొన్నాల …

    Read More »
  • 14 October

    బతుకమ్మ ప్రత్యేక వీడియో సాంగ్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే

    బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక వీడియో సాంగ్‌ను గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సతీమణి జయతార విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. ఆనందోత్సహాల మధ్య ప్రజలు బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో బుగ్గ …

    Read More »
  • 14 October

    ‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్‌ లేఖ!

     ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే వరకూ రెండు ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత సడెన్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ నుంచి ఎన్నికైన 11 మంది సభ్యులూ రాజీనామాలు చేశారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్ రాజ్ లేఖ రాశారు. ‘మా’ పోలింగ్‌ సమయంలో మోహన్ బాబు చాలా దురుసుగా ప్రవర్తించారని ప్రకాశ్ రాజ్ …

    Read More »
  • 14 October

    పాకిస్థాన్ కు అమిత్ షా వార్నింగ్

     పాకిస్థాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వ‌న్నారు. దాడుల‌ను ఏమాత్రం స‌హించ‌బోమ‌ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నిరూపించాయి. మీరు ఇలాగే అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స్ట్రైక్స్ త‌ప్ప‌వు అని అమిత్ షా హెచ్చ‌రించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మాజీ ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యం ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌. ఇండియా స‌రిహ‌ద్దుల‌ను ఎవ‌రూ చెరిపే ప్ర‌య‌త్నం …

    Read More »
  • 14 October

    “శృంగేరి పీఠంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” జమ్మి మొక్క”

    మొక్కల యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అద్భుతంగా ముందుకు సాగుతుంది. కాలాల్ని, సంస్కృతుల్ని, పండగల్ని తనలో మిలితం చేసుకొని కొత్త ఆలోచనలతో ప్రకృతి ప్రేమికులను కదలిస్తుంది. అందులో భాగంగానే నిర్వాహకులు. “ఊరి ఊరికో జమ్మిచెట్టు – గుడి గుడికో జమ్మి చెట్టు” నాటే మహాసంకల్పాన్ని తీసుకున్నారు.ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా, ఇవ్వలా శృంగేరిలోని శ్రీ.శ్రీ.శ్రీ. జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షినామ్నాయ శ్రీ శారద పీఠంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం దిగ్విజయంగా …

    Read More »
  • 14 October

     దేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు

     దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 15,823 కేసులు నమోదవగా, తాజాగా అవి 18 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 16 అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక యాక్టివ్‌ కేసులు 2.06 లక్షలకు తగ్గాయి. గత 215 రోజుల్లో యాక్టివ్‌ కేసులు 2 లక్షలకు తగ్గడం ఇదే మొదటిసారి. దేశంలో కొత్తగా 18,987 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730కు …

    Read More »
  • 14 October

    ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే

    ఐపీఎల్‌( IPL 2021 )లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. గ‌త సీజ‌న్‌లో ఫైన‌ల్ వ‌ర‌కూ వ‌చ్చినా ట్రోఫీ అందుకోలేక‌పోయిన ఆ టీమ్‌.. ఈసారి క్వాలిఫైయ‌ర్ 2లో ఇంటిబాట ప‌ట్టింది. కేవ‌లం మ‌రో బంతి మిగిలి ఉన్న స‌మ‌యంలో రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్ట‌డంతో కోల్‌క‌తా ఈ మ్యాచ్ గెలిచి ఫైన‌ల్ చేరింది. దీంతో మ్యాచ్ త‌ర్వాత కెప్టెన్ రిష‌బ్ పంత్‌, ఓపెన‌ర్ పృథ్వి షా భావోద్వేగానికి గుర‌య్యారు. …

    Read More »
  • 14 October

    దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సరికొత్త విధానం..

    తెలంగాణలో ప్రభుత్వ వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న మూడంచెల వైద్య వ్యవస్థ స్థానంలో ఐదంచెల వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. పల్లె దవాఖానలు, సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటుచేస్తూ ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామంలోనే నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రమోటివ్‌ కేర్‌ను, జిల్లా పరిధిలోనే సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు …

    Read More »
  • 14 October

    హూజూరాబాద్ By Elections-బుల్లెట్ బండెక్కి ప్ర‌చారానికి వ‌చ్చేత్తా..పా అంటూ దివ్యాంగుడు

    హూజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో దివ్యాంగుడైన డి. మ‌హేశ్ బుల్లెట్ బండెక్కి ప్ర‌చారానికి వ‌చ్చేత్తా..పా అంటూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం చేస్తున్న ఎన్నిక‌ల‌ ప్ర‌చారం ప‌లువురిని ఆక‌ర్శిస్తోంది. త‌న బుల్లెట్ బైక్‌కు ఫ్లెక్సీలు క‌ట్టుకుని జ‌న‌చైత‌న్యయాత్ర పేరుతో నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు చిత్రాల‌తో ఉన్న ప్లెక్సీలు బైక్‌కు మూడు వైపుల క‌ట్టుకుని ఎక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రిగితే అక్క‌డికి …

    Read More »
  • 14 October

    హూజూరాబాద్ By Elections-కాంగ్రెస్,బీజేపీలకు షాక్

    హూజూరాబాద్‌లో కారుజోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌చారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌తి గ్రామంలో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. బుధ‌వారం వీణవంక మండలం లోని మల్లన్న పల్లి గ్రామానికి చెందిన 15 మంది, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 25 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువ‌కులు టీఆర్ఎస్‌లో చేరారు. వారికి స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat