Home / SLIDER / బతుకమ్మ ప్రత్యేక వీడియో సాంగ్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే

బతుకమ్మ ప్రత్యేక వీడియో సాంగ్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక వీడియో సాంగ్‌ను గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సతీమణి జయతార విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. ఆనందోత్సహాల మధ్య ప్రజలు బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో బుగ్గ ఆలయ చైర్మన్‌ మాసాడి శ్రీదేవి, కౌన్సిలర్లు నెల్లి శ్రీలత, తుంగపిండి సుజాత, షేక్‌ ఆస్మా, గోసిక రమేశ్‌, నీలి కృష్ణ, నాయకులు నెల్లికంటి శ్రీనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.