Home / SLIDER / ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే

ఐపీఎల్‌( IPL 2021 )లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. గ‌త సీజ‌న్‌లో ఫైన‌ల్ వ‌ర‌కూ వ‌చ్చినా ట్రోఫీ అందుకోలేక‌పోయిన ఆ టీమ్‌.. ఈసారి క్వాలిఫైయ‌ర్ 2లో ఇంటిబాట ప‌ట్టింది. కేవ‌లం మ‌రో బంతి మిగిలి ఉన్న స‌మ‌యంలో రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్ట‌డంతో కోల్‌క‌తా ఈ మ్యాచ్ గెలిచి ఫైన‌ల్ చేరింది.

దీంతో మ్యాచ్ త‌ర్వాత కెప్టెన్ రిష‌బ్ పంత్‌, ఓపెన‌ర్ పృథ్వి షా భావోద్వేగానికి గుర‌య్యారు. త్రిపాఠి సిక్స్ కొట్ట‌గానే పృత్వి షా గ్రౌండ్‌లోనే కుప్ప‌కూలిపోయాడు. ఆ త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోనూ అత‌డు దుఃఖాన్ని ఆపుకోలేక‌పోయాడు. క‌న్నీళ్లు తుడుచుకుంటూ క‌నిపించాడు.

ఇక మ్యాచ్ త‌ర్వాత మాట్లాడుతూ కెప్టెన్ రిష‌బ్ పంత్ కూడా భావోద్వేగానికి గుర‌య్యాడు. ఇప్పుడేమీ మార్చ‌లేము కదా అంటూ ఎంతో నిర్వేదంతో అత‌డు మాట్లాడాడు. మ‌మ్మ‌ల్ని మేము విశ్వ‌సించినంత‌సేపూ మేము మ్యాచ్‌పై ప‌ట్టు స‌డ‌లించ‌లేదు. అయితే కోల్‌క‌తా చాలా బాగా బౌలింగ్ చేసింది. మేము మ‌ధ్య ఓవ‌ర్ల‌లో త‌డ‌బడ్డాం. వ‌చ్చే ఏడాది మ‌రింత బ‌లంగా వ‌స్తామ‌ని పంత్ అన్నాడు. క్వాలిఫ‌య‌ర్ 1లో చెన్నై చేతిలో, క్వాలిఫ‌య‌ర్ 2లో కోల్‌క‌తా చేతుల్లో ఓడి ఢిల్లీ ఇంటిదారి ప‌ట్టింది.