ప్రధాని నరేంద్ర మోదీకి ఇవాళ 71 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా గ్రీట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే, మోదీజీ అంటూ రాహుల్ తన ట్విట్టర్‌లో తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. సుదీర్ఘ కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
Read More »రేవంత్ కి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన శశిథరూర్
కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినంత మాత్రాన వెనకటి బుద్ధులేడికి పోతయన్నట్టు.. వదరుబోతు రేవంత్‌రెడ్డి లాంటి కురచ బుద్ధుల నేతను అందలమెక్కించినందుకు ఆ పార్టీ పాపపు ఫలితాన్ని అనుభవిస్తున్నది. నోరున్నది కదా అని ఎవరినైనా తిట్టించవచ్చుననుకొని పీసీసీ పీఠంపై కూర్చోబెట్టినందుకు అదే భస్మాసురహస్తంగా మారింది. ఇతరులను తిడతాడనుకొంటే.. తమ పార్టీ జాతీయ స్థాయి నాయకులనే అడ్డగోలుగా తిట్టించుకొనే పరిస్థితిని కోరి కొని తెచ్చుకొన్నది. భారతదేశంలో శశిథరూర్ ఒక మంచి స్కాలర్. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు …
Read More »యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ
యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటిస్తారా..?. వచ్చేడాది చివరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ CM అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రాను ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో బరిలో దిగనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. అయితే, దీనిపై ఇంకా స్పష్టత లేదన్నారు. పార్టీ కోసం ప్రియాంక ఎంతో శ్రమిస్తున్నారని ఖుర్షీద్ చెప్పారు.
Read More »కాంగ్రెస్ పార్టీకి షాక్
కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుస్మితా దేవ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్ ఇండియా మహిళా …
Read More »రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ అన్‌లాక్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతల అకౌంట్లను.. ట్విట్టర్ సంస్థ అన్‌లాక్ చేసింది. ఇటీవల ఢిల్లీలో రేప్, హత్యకు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన నేపథ్యంలో రాహుల్‌తో పాటు ఆ పార్టీ నేతల అకౌంట్లను ట్విట్టర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రాహుల్ .. ట్విట్టర్‌పై విరుచుకుపడ్డారు. భారతీయ రాజకీయ …
Read More »ఢిల్లీలో ఎంపీ రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడి నియమాకంపై కాంగ్రెస్ అధిష్ఠానం మరో సారి దృష్టి సారించింది. అతి త్వరలో టీపీసీసీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ పార్టీలోని వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన కమిటీ ఒక ఫార్ములాను రూపొందించిందని, దీన్ని అమలు చేసిన వెంటనే తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉందని ఢిల్లీలో పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న రేవంత్‌రెడ్డి …
Read More »అసలు టూల్‌కిట్ రభస ఏమిటి?
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంతో, విద్వేష జాఢ్యంతో ప్రతిపక్షాలపై నిత్యం విషం గక్కే బిజెపి, కాషాయ పరివారం ఈ సారి తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది. – దేశాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకున్న టూల్‌కిట్ చూడండి అంటూ ఎఐసిసి అధికారిక లెటర్ హెడ్ కాపీగా ఒక పత్రాన్ని జతచేసి ‘కాంగ్రెస్‌టూల్‌కిట్ ఎక్స్‌పోజ్డ్’ హ్యాష్‌ట్యాగ్‌తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా …
Read More »కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి
కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) కరోనాతో మరణించారు. ఏప్రిల్ 22న కరోనా బారిన పడ్డ ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. రాహుల్ గాంధీతో సతావ్ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం తెలిపారు.
Read More »కరోనా నుండి కోలుకున్న మాజీ ప్రధాని
ఇటీవల కరోనా మహమ్మారి భారీన పడిన మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ కోలుకున్నారు.ఇటీవల ఆసుపత్రిలో చేరిన కరోనా మహమ్మారికి చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుండి మన్మోహాన్ సింగ్ డిశ్చార్జ్ అయ్యారు.కరోనా సోకడంతో ఆయన ఈ నెల పంతొమ్మిది తారీఖున ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన సంగతి విదితమే. ప్రస్తుతం మన్మోహాన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది..
Read More »కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి
అనంతపురం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎమ్మెల్యే కామగానహళ్లి తిప్పేస్వామి(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిగి మండలం సేవా మందిరంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1941లో ఏప్రిల్ 6న జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సేవా మందిర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సొంత స్థలంలో …
Read More »