Home / Tag Archives: andhrapradeshcmo

Tag Archives: andhrapradeshcmo

నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగింది

Ap అసెంబ్లీలో చర్చించడానికి ప్రతిపక్షం వద్ద ఏ అంశాలు లేక దురుద్దేశంతో వ్యవహరించిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీని కౌరవ సభ అని చంద్రబాబు వెళ్లిపోయారని విమర్శించారు. నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగిందని మండిపడ్డారు. సభలో బీసీలు, మైనారిటీల అంశాలతో పాటు వరద నష్టంపై చర్చించినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ కూడా ఓపిగ్గా సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు.

Read More »

వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు.. ఒకరికి ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 100 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం నివేదికలను పూర్తి చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహించే స్కూళ్లలో 20 మంది లోపు విద్యార్థులు ఉంటే గుర్తింపును రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. తొలుత స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులిచ్చి, అనంతరం మూసివేత ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.

Read More »

బాబుకు ముద్రగడ ఘాటు లేఖ

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘మీరు ఏడవడం చూసి ఆశ్చర్యపోయా. మీ కంటే మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. కాపు ఉద్యమ టైంలో దీక్ష చేపట్టిన నన్ను, నా కుటుంబసభ్యులను పోలీసులతో బూతులు తిట్టించారు. మరి మీ శ్రీమతి గారు దేవతా? మీరు చేసిన హింసకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. …

Read More »

జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయం

ఏపీలో జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఇవాళ అసెంబ్లీలో మరో తీర్మానం తెచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో మండలిలో తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో దాన్ని రద్దు చేయాలని 2020, జనవరిలో సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు

Read More »

ఏపీ నిరుద్యోగ యువతకు శుభవార్త

ఏపీ వైద్యారోగ్యశాఖ పరిధిలోని బోధన కాలేజీలు, ఆస్పత్రుల్లో 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. https://dme.ap.nic.in/ సైట్ ద్వారా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకులు డా. రాఘవేంద్రరావు తెలిపారు. 326 పోస్టుల్లో 188 మందిని కొత్తగా నియమిస్తామని.. ఏపీపీవీపీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులతో మిగతా 138 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

Read More »

చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి వ్యాఖ్యలపై YSRCP MLA క్లారిటీ

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి తానేమీ మాట్లాడలేదని, చంద్రబాబే అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ) అన్నారు. అసెంబ్లీలో జరిగింది వేరు, బయట ప్రచారం చేస్తున్నది వేరని వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబం, భువనేశ్వరి అంటే తనకు గౌరవముందని చెప్పారు. కాగా, ‘లోకేశ్ ఎలా పుట్టాడో తెలుసా?’ అంటూ అసెంబ్లీలో ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Read More »

మూడు రాజధానులపై AP సర్కారు సంచలన నిర్ణయం

ఏపీకి మూడు రాజధానులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వీకేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రివర్గం రద్దు చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.

Read More »

Ap నిరుద్యోగ యువతకు శుభవార్త

ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 10,865 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 7390 కాగా, కొత్తగా సృష్టించినవి 3475 ఉన్నాయి. దీనిలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 4142 పోస్టులు, APVVP పరిధిలో 2520 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 4203 పోస్టులు ఉండగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయనున్నారు.

Read More »

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో YSRCP హవా

ఏపీలో వెలువడుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా గుంటూరు జిల్లా గురజాల మున్సిపాలిటీని అధికార పార్టీ వైసీపీ   కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో 16 చోట్ల  వైసీపీ అభ్యర్థులు విజయం సాధించింది.. 3 వార్డుల్లో  టీడీపీ, ఒక వార్డులో జనసేన అభ్యర్థులు గెలిచారు. అలాగే కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీలో 20 వార్డులకు 15 వార్డుల్లో  వైసీపీ 5 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అటు కర్నూలు …

Read More »