ఏపీ మాజీ ముఖ్యమంత్రి… ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో విపత్తుల సమయంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు.. ప్రజలకు అండగా నిలబడింది..
తమ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో రైతులని పట్టించుకోలేదు.. రైతాంగానికి టీడీపీ వైసీపీ ప్రభుత్వంలో అందిన లబ్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నిజాయితీ ఉంటే డేట్ టైం ఫిక్స్ చేసి త్వరలోనే చర్చకు రావాలని సవాల్ విసిరారు.