జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాంట్రాక్ట్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. తెలంగాణలో జనసేనకు వచ్చిన ఓట్లు చూసి పవన్ కు మతి చలించిందని ఎద్దేవా చేశారు.
‘పవన్ ఏ ఊరు? ఏ నియోజకవర్గం? పార్టీ లక్ష్యం ఏంటి? బాపట్ల, చీరాల, నెల్లూరు అంటూ తన జీవితాన్ని నటనలో కలిపేశాడు. బీజేపీతో అధికారికంగా, టీడీపీతో అనధికార ఒప్పందం చేసుకున్నాడు’ అని ఆయన మండిపడ్డారు.