మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా …
Read More »నవభారతానికి బోణీ-మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఆరంభం
ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్న వేళ.. చట్టాలు చట్టుబండలవుతున్న తరుణాన.. రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యమవుతున్న సమయాన.. ఆరాచక శక్తుల వికృత చేష్ఠలకు భారతీయ సమాజం విచ్ఛిన్నమవుతున్న పరిస్థితుల్లో ఆ కుట్రలకు చెల్లుచీటీ పలికేందుకు.. రక్కసి మూకలను తరిమికొట్టేందుకు పిడికిలి బిగించి జాతీయ రాజకీయాల బరిలో దూకిన భారత్ (తెలంగాణ) రాష్ట్ర సమితి.. మునుగోడులో విజయకేతనం ఎగరేసి బోణీ కొట్టింది. నవభారతానికి నాంది పలుకుతూ గులాబీ దండు జైత్రయాత్రను ప్రారంభించింది. కారు దూసుకెళ్లింది. మోదీ …
Read More »ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవబలం తోడయింది- వినోద్ కుమార్
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవ బలం కూడా ఉన్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తమకు మునుగోడులో గతంలోకంటే 25 వేల ఓట్లు అధికంగా వచ్చాయని చెప్పారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన సాంప్రదాయ ఓట్లను కోల్పోయిందన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్‌కు కనీసం డిపాజిట్ వస్తే తాను …
Read More »EWS రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లోని అగ్రవర్ణాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్‌ను కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ కోటాను సవాల్ చేస్తే వేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు సోమవారం తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీంకోర్టు …
Read More »మునుగోడు విజయం… కృష్ణార్జున సారథ్యం
తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి విదితమే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా …
Read More »సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు,కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పదివేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయకేతనం …
Read More »కమల్ హాసన్ గర్వపడేలా నటించాడు-బీజేపీ నేత వీడియోపై మంత్రి కేటీఆర్ ట్వీట్
మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన యాక్టింగ్‌పై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీజేపీ నాయకుల డ్రామాకు సంబంధించిన వీడియోను తన ట్వీట్టర్ పేజీలో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. బీజేపీ నాయకుల డ్రామాను ఈ దేశ ప్రజలు తప్పక చూడాలి. పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ తీసుకెళ్లొద్దని పోలీసులు సూచించినందుకు.. బీజేపీ నాయకుడు ఒకరు హంగామా సృష్టించారు. …
Read More »దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ
దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ మారిందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్‌యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో …
Read More »రేపే మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6న నల్లగొండ శివారు ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో లెక్కింపు జరుగనున్నది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్ హాళ్లలో వసతుల కల్పన పూర్తయ్యాయి. ఒకే హాల్‌లో 21 టేబుళ్లపై 15 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు మొదలయ్యే కౌంటింగ్ మధ్యాహ్నం 1 గంటలోపు …
Read More »ఈనెల 12న తెలంగాణాకు ప్రధాని మోదీ
తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని ఈనెల 12వతేదీన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమైన సీఎస్… ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా …
Read More »