Home / EDITORIAL / నవభారతానికి బోణీ-మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఆరంభం

నవభారతానికి బోణీ-మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఆరంభం

ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్న వేళ.. చట్టాలు చట్టుబండలవుతున్న తరుణాన.. రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యమవుతున్న సమయాన.. ఆరాచక శక్తుల వికృత చేష్ఠలకు భారతీయ సమాజం విచ్ఛిన్నమవుతున్న పరిస్థితుల్లో ఆ కుట్రలకు చెల్లుచీటీ పలికేందుకు.. రక్కసి మూకలను తరిమికొట్టేందుకు పిడికిలి బిగించి జాతీయ రాజకీయాల బరిలో దూకిన భారత్ (తెలంగాణ) రాష్ట్ర సమితి.. మునుగోడులో విజయకేతనం ఎగరేసి బోణీ కొట్టింది. నవభారతానికి నాంది పలుకుతూ గులాబీ దండు జైత్రయాత్రను ప్రారంభించింది. కారు దూసుకెళ్లింది. మోదీ సర్కారు అంతానికి బీజం పడింది.

దోపిడీ.. కుట్రలు.. కుతంత్రాలు.. అన్నీ ఒక్కటే. కాకపోతే నాడు తెలంగాణ. నేడు యావత్ భారతం. ఆ విధ్వంసాలు, అప్రజా స్వామిక విధానాలపై శంఖం పూరించిన నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరే. 60 ఏండ్ల వలస పాలనలో తెలంగాణ చిక్కి శల్యమైన వేళ.. స్వరాష్ట్రం ఇక తీరని కలగానే మిగులు తుందనే సందర్భాన.. దశాబ్దాల ఆకాంక్షలు ఆవిరవుతున్న తరుణాన.. ఒక చేయి పిడికిలి బిగించింది. పోరు బావుటాను పైకెత్తింది. తెలంగాణ మట్టిబిడ్డలను తట్టిలేపింది. విజయ కేతనం ఎగరేసింది.. శృంఖలాలను తెంచు కొని.. శక్తులన్నీ కూడగట్టుకొని.. అభివృద్ధిలో, సంక్షేమంలో దేశానికే ఆదర్శమై నిలుస్తూ.. యావత్ భారత దృష్టిని ఆకర్షిస్తూ.. సబ్బండ వర్ణాల మన్ననలను పొందుతున్నది. ఆ ప్రగ తిని.. నలుదిశలకు విస్తరిస్తున్న ఖ్యాతిని ఓర్వలేక పగబట్టింది కాషాయ ఆరాచక శక్తి. కుట్రలతో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల దోస్తూ.. రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ.. మత సామరస్యతను విచ్ఛిన్నం చేస్తూ, జాతి సమగ్రతకు గొడ్డలిపెట్టుగా మారిన శక్తు లపై కేసీఆర్ సమరశంఖం పూరించారు. నవ భారత నిర్మాణం కోసం పిడికిలి బిగించారు. ఆ ఆశయంతోనే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితిని (టీఆర్ ఎస్) భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారు. మునుగోడు ఉప ఎన్నికలో విజ యదుందుభి మోగించి నవభారత్ నిర్మాణా నికి నాంది పలికారు.

గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ సక్సెస్..
—————————————
ఏ పని అయినా సరే ఎంత గొప్పగా ఆరం భిస్తే అంతటి మహా విజయాలను సొంతం చేసుకోవడం ఖాయం. వీటిని స్వయంగా చెప్పడమేకాదు, అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ ఆచరణలోనూ చూపెట్టారు. అందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి సాధిస్తూ వచ్చిన విజయాలే నిదర్శనం. తెలం గాణకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేసిన కేసీఆర్.. ఆ తరువాత రాష్ట్ర సాధనే ధ్యేయంగా అడుగులు వేశారు. తెలం గాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్సార్ తోపాటు చాలా మంది మేధావుల సహకా రంతో 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. గులాబీ జెండాను ఆవిష్కరిం చారు. రెండు నెలల స్వల్పకాలంలోనే 1000 ఎంపీటీసీ, 87జడ్పీటీసీ, 84 ఎంపీపీ, కరీం నగర్ జడ్పీ చైర్మన్ పదవులను దక్కించుకొని తెలంగాణ ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. భారీ బహిరంగ సభలను నిర్వహించి సింహ గర్జన చేశారు. అలుపెరుగని పోరాటం సాగించి తెలంగాణ స్వరాష్ట్ర కలను సాకారం చేశారు. అటు తరువాత జరిగిన ఎన్నిక ల్లోనూ సత్తా చాటి ఉద్యమనేత ముఖ్యమం త్రిగా బాధ్యతలు చేపట్టారు. వినూత్న ఆలో చనలతో, విధానాలతో తెలంగాణను ప్రగతి పథంలోనే నడిపిస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.

బీఆర్ఎస్ కు సబ్బండ వర్ణాల ఆశీర్వాదం
——————————————-
బీఆర్ఎస్ ప్రస్థానానికి సబ్బండ వర్ణాల ఆశీర్వాదం లభించింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై మేధావులు, వివిధ రంగాల నిపుణులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమం త్రులు, ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు సాగించారు. దేశ రాజకీయ పరిస్థి తులు, అభివృద్ధి విధానాలపై సమాలోచనలు సాగించారు. తానే స్వయంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తెలం గాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజాశీర్వాద సభలను నిర్వహించి పరిస్థితు లను వివరించారు. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చి జాతీయ రాజ కీయాల్లోకి వెళ్తున్నట్లు దసరా రోజున ప్రకటిం చారు. పార్టీ పేరు మార్పు అనంతరం వచ్చిన మునుగోడు ఉపఎన్నికలో విజయాన్ని కట్ట బెట్టి బీఆర్ఎస్ ఏర్పాటును ఆమోదించింది.

నాడు సిద్దిపేట.. నేడు మునుగోడు..
—————————————-
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమనేత సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యే స్థానానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీ నామా చేయడం, ఆ తరువాత సెప్టెం బర్ 22, 2001 అసెంబ్లీ ఉపఎన్నిక రావడం తెలిసిందే. ఆ ఉప ఎన్నికలో కేసీఆర్ సాధించిన ఘన విజయంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్య మానికి తొలి ముందడుగు పడింది. టీఆ ర్ఎస్కు పట్టం కట్టి సిద్దిపేట చరిత్ర సృష్టించింది. నేడు అలాంటి చారిత్రక సందర్భమే మునుగోడులో పునరావృత మైంది. జాతీయ రాజకీయాల్లో బీఆర్ ఎస్ విజయ ప్రస్థానానికి మునుగోడు నాంది పలికింది. కొత్త చరిత్రకు వేదిక యింది. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రూపంలో పెను మార్పులు రాబోతున్నాయని రాజకీయ పండితులు కాంక్షిస్తున్నారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar