ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈరోజు బుధవారం రాత్రికి ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయల్దేరి వెళ్లనున్నారు. రేపు గురువారం రోజు జరగనున్న ఏసియాన్, తూర్పు ఆసియా సదస్సుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల్గొంటారు. ఏషియాన్లోని సభ్య దేశాలతో వ్యాపార, సముద్ర తీర భద్రత సహకారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. తిరిగి ప్రధానమంత్రి మోదీ రేపు గురువారం సాయంత్రం భారత్ కు చేరుకోనున్నారు.
Read More »శివలింగాన్ని అవమానించిన బీజేపీ మంత్రి
యూపీకి చెందిన మంత్రి సతీశ్ శర్మ శివలింగం వద్ద చేతులు కడగటం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టిస్తుంది. యూపీ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సతీశ్ శర్మ ,మరికొంతమంది మంత్రులు.. బీజేపీకి చెందిన నేతలతో ఇటీవల రామ్ నగర్ తెహసీల్ లోని హెత్మాపూర్ గ్రామంలో లోధేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని గత నెల ఇరవై ఏడో తారీఖున సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ …
Read More »జమిలీ ఎన్నికలపై కేంద్ర మంత్రి క్లారిటీ..?
జమిలీ ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఒకరు క్లారిటీచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆయన క్లారిటీచ్చారు. అయితే త్వరలో కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యధావిధిగా టైం ప్రకారమే …
Read More »నీకు దమ్ముంటే బిల్కిస్ బానోతో రాఖీ కట్టించుకో- ప్రధాని మోదీకి మహా మాజీ సీఎం థాకరే సవాల్
నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) సభ్యులందరూ ముస్లిం మహిళలతో రాఖీలు కట్టించుకోవాలంటూ పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్రమోదీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే (UBT) శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు గుప్పించారు. ముస్లింల విషయంలో బీజేపీది, ఆ పార్టీ నేతలది ఎప్పుడైనా ద్వంద్వ వైఖరేనని మండిపడ్డారు. ఒక వైపు హిందూ, ముస్లింల మధ్య మతచిచ్చు రేపుతూనే మరోవైపు ముస్లింలపై ప్రేమ ఒలకబోయడం బీజేపీ నేతల …
Read More »ఢిల్లీ సీఎం ఇంటికి సమీపంలో వరద నీళ్ళు
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో యమునా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీళ్లు ఢిల్లీ సీఎం.. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోకి వచ్చేశాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఐదోందల మీటర్ల దూరం నుండి ఈ వరద నీళ్లు ప్రవహిస్తోన్నాయి. కశ్మీరీ గేట్ – మంజుకా తిలానీని కలిపే ప్రాంతంలో యమునా నది నీరు చేరి వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. దీంతో రాకపోకలు …
Read More »తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు -కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. అసలే అంతర్గత పోరు, వర్గ విభేదాలతో అతలాకుతలమైన రాష్ట్ర బీజేపీకి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్టుగా మారాయి. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో మేం బలపడతాం. ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదుగుతాం. అన్నీ అనుకూలిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి’ అని …
Read More »గుజరాత్‌లోని పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువ
గుజరాత్ దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిందంటూ ఊదరగొట్టే బీజేపీ నేతల మాటలన్నీ కల్పితాలేనని మరోసారి రుజువైంది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువగా ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఐదేండ్లలోపు మొత్తం చిన్నారుల్లో 9.7 శాతం కంటే ఎక్కువ మంది తక్కువ బరువుతో ఉన్నట్టు తేలింది. వయసుకు తగిన ఎత్తు లేని చిన్నారుల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో, శారీరక బలహీనత …
Read More »ప్రధాని మోదీపై ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘రైతుల నిరసనను, ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న వారి అకౌంట్లను బ్లాక్ చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. లేదంటే దేశంలో ట్విటర్ను బ్లాక్ చేస్తామంది. మా కార్యాలయాలు మూసేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై రైడ్స్ చేయిస్తామని (చేశారు కూడా) పేర్కొంది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి’ …
Read More »ప్రధాని మోదీ,సీఎం యోగి పై చర్చ వల్ల ఓ నిండు ప్రాణం బలి
ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి జరిగిన ఓ చర్చ ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. తన సోదరుడి కుమారుడి పెళ్లి కోసం మీర్జాపూర్ వెళ్లిన రాజేశార్.. తిరిగి కారులో వస్తున్నారు.. ఈ తిరుగు ప్రయాణంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిలపై డ్రైవర్లో చర్చ మొదలైంది. వారి మధ్య మాటామాటా పెరగడంతో డ్రైవర్ కు కోపం వచ్చింది.. దీంతో రాజేష్ ను కారు …
Read More »రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం
తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమస్యలపై చర్చించేందుకు మరోసారి వారిని ఆహ్వానించినట్లు ట్వీట్ చేశారు. అయితే రెండు రోజుల క్రితమే రెజ్లర్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాగ్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది
Read More »