గుజరాత్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో లైంగిక దాడి, ఏడుగుర్ని చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిపై కనికరం చూపరు. కానీ గోద్రా సబ్ జైలు నుంచి విడుదలైన దోషులను అక్కడి వీహెచ్ పీ కార్యాలయంలో దండలతో సత్కరించడం చర్చనీయాంశమైంది.ప్రస్తుతం ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు …
Read More »RSS పై మూవీ తీస్తా
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై త్వరలో సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తానని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వరకు RSSపై తనకున్న భావన వేరని అన్నారు. RSSపై చిత్రం తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్ పూర్ వెళ్లానని.. అక్కడ సంస్థ గురించి వాస్తవాలు తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నట్లు చెప్పారు.
Read More »కాళేశ్వరం తో రైతాంగానికి లాభాలెన్నో..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం.. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందుతున్న సంగతి విదితమే. అయితే ఈ ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు భారీగా పేరుకుపోతున్నాయి అని. గత మూడేళ్లలో 140 టీఎంసీలు తరలించగా రూ.3,600 కోట్ల బిల్లు వచ్చింది. సకాలంలో చెల్లించకపోవడంతో TSNPDCL, TSSPDCLకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,114 కోట్లు బకాయి పడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1 టీఎంసీ …
Read More »మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్ధతుగా కోదండరాం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఇదే ఏడాదిలో ఉప ఎన్నికలు రానున్న సంగతి విదితమే. అయితే ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను తమకు మద్ధతు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి అదేశాలతో ఆ పార్టీ నేతలు …
Read More »ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్
ప్రధానమంత్రి నరేందర్ మోదీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్ధేశించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ” 2022 నాటి లక్ష్యాలనే సాధించలేని ప్రధాని మోదీ.. 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడమేమిటని ఎద్దేవాచేశారు.సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడంపై ట్విట్టర్ వేదికగా …
Read More »బీజేపీని నమ్ముకుంటే వైకుంఠపాళిలో పామునోట్లో పడ్డట్లే: కేసీఆర్
సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లను దోచి షావుకార్లకు దోచిపెడుతోందని టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఎమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. మళ్లీ అలాంటి పరిస్థితులు తేవొద్దని …
Read More »డీజీపీ మహేందర్ రెడ్డికి కరోనా
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత ఐదు రోజులుగా ఆయన విధులకు హాజరుకావడం లేదు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. గోల్కొండలో నిన్న నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో కరోనా కారణంగానే ఆయన పాల్గొనలేదు. దీంతో అడిషనల్ డీజీ జితేందర్ నిన్న జరిగిన కార్యక్రమాన్ని పర్య వేక్షించారు.
Read More »టీఆర్‌ఎస్ కు షాక్
తెలంగాణలోని కొమురం భీం జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. బెజ్జూరు జెడ్పీటీసీ పుష్పలత , ఎంపీటీసీ సాయన్న , ముగ్గురు సర్పంచులు, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు పార్టీకి రాజీనామా చేశారు. రహదారులు, వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన చెందారు. 12 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నా పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆరోపించారు. తమ రాజీనామాను ఆమోదించాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు, …
Read More »నేడు వికారాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంగళవారం వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రూ. 61 కోట్లతో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు.అంతే కాకుండా మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. అంతకుముందు ఆయన ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ అబిడ్స్ …
Read More »బండి సంజయ్ పాదయాత్రలో గొడవ.. పలువురికి గాయాలు
జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ బండి సంజయ్‌ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరకీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని సంజయ్ అన్నారు. దీంతో అక్కడ ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో గొడవ దిగారు. ఈ …
Read More »