కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకోచ్చిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి మనం సంగతి విదితమే. కేంద్ర సర్కారు తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తొలి బ్యాచ్ అగ్నివీరులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అస్సాం రైఫిల్స్, CAPFలలో 10% పోస్టులను అగ్నివీరులతో భర్తీ చేస్తామంది.
Read More »దుర్మార్గపు ఆలోచనలతోనే ‘అగ్నిపథ్’: నారాయణ
నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. దాని ఫలితమే దేశంలో హింసాకాండ అని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నారాయణ స్పందించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అర్ధంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను మాయ చేసేందుకు దుర్మార్గపు ఆలోచనలతోనే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని నారాయణ విమర్శించారు.
Read More »దాని అర్థం ‘విశ్వగురు’కే తెలుసు: కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో వ్యంగ్య్యాస్త్రాలు సంధించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన పలు కార్యక్రమాలపై విమర్శలు చేశారు. ‘‘రైతు చట్టాలు రైతులకు అర్థంకావు.. సాధారణ ప్రజలకి నోట్ల రద్దు అర్ధం కాదు.. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు.. ముస్లింలకు సీఏఏ అర్థం కాదు.. గృహిణులగా ఉన్న మహిళలకు ఎల్‌పీజీ …
Read More »సంజయ్‌లాంటి నేతల వల్లే దేశంలో అశాంతి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనల వెనుక టీఆర్‌ఎస్ ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలు సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. దేశ రక్షణ కోసం సేవ చేయాలనుకునే యువతను బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు. గతంలో రైతన్నలు, ఇప్పుడు సైనికులను నిర్లక్ష్యంగా చూడటం హేయమైన …
Read More »‘అగ్నిపథ్’ పేరుతో యువత ఉసురు తీస్తున్నారు: మంత్రి నిరంజన్‌రెడ్డి
బీజేపీ పాపం ముదిరి పాకాన పడిందని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మొన్నటి వరకు వ్యవసాయచట్టాలతో రైతుల ఉసురు పోసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ‘అగ్నిపథ్’ పేరుతో యువత ఉసురు తీస్తోందని ఆరోపించారు. ‘అగ్నిపథ్’ అనాలోచితమైన నిర్ణయమన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరుద్యోగ యువకుల ఆందోళన నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 90 రోజుల్లోనే 46వేల మంది నియామకం చేపట్టి కేవలం రూ.30వేల జీతం ఇవ్వడం అర్ధరహితమన్నారు. దేశభద్రత విషయంలో ఇలాంటి …
Read More »దేశంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త
రానున్న సంవత్సరకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,48,463 నియామకాలను పూర్తి చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. గత ఎనిమిదేళ్లలో ఏడాదికి సగటున 43,678 కొత్తగా ఉద్యోగాలిస్తున్నామని వెల్లడించింది. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం 3,49,422 మందికి ఉద్యోగాలిచ్చామ్ము. 2022-23లో మరో 1,48,463 నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది. మోడ్రన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్ సి, డి పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Read More »కేసీఆర్‌ను కించపరుస్తూ స్కిట్.. బీజేపీ నేతలు అరెస్ట్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జూన్ 2న నాగోల్ బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభను నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఓ స్కిట్ వేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయగా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి …
Read More »రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కల్సి పని చేస్తేనే అభివృద్ధి
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో కేంద్రం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రాలకు కోట్ల నిధులు కేటాయించామని ఆమె వెల్లడించారు. మంగళగిరి ఎయిమ్స్‌కు కేంద్రం రూ. 1618 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రజాసేవ కోసం కేంద్ర, …
Read More »సీఎం కేసీఆర్ కు మద్ధతుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
దేశంలో ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైనదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో అన్నారు.విభజన రాజకీయాలతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వీటికి అడ్డుకట్ట వేయకపోతే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠ మరింత దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సమర్థ ప్రతిపక్షంగా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం అనివార్యమని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ను …
Read More »ఐదేండ్ల లోపు పిల్లలకు ఇంటి దగ్గరే ఆధార్
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో చేరనున్న ఐదేండ్ల లోపు పిల్లల ఆధార్ వివరాలను వారి ఇండ్ల వద్దనే పోస్టల్‌శాఖ ఉచితంగా నమోదు చేస్తుందని హైదరాబాద్ రీజియన్ పోస్టాఫీస్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లల పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటో, బయోమెట్రిక్ తదితర వివరాలను తల్లిదండ్రులు తమ ఇంటి వద్దకు వచ్చిన పోస్టుమ్యాన్‌కు అందజేయాలని సూచించారు. తెలంగాణలో 1,552 మంది డాక్‌సేవక్‌లు, పోస్ట్‌మ్యాన్‌లు ఆధార్ నమోదు సేవల్లో పాల్గొంటారని …
Read More »