నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఇవాళ ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నవారి శక్తి కన్నా.. ప్రజాశక్తియే ఎప్పటికీ గొప్పదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రైతుల చట్టాలను వ్యతిరేకించడంలో తెలంగాణ సర్కార్ ముందున్న విషయం తెలిసిందే. కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆందోళన కూడా చేపట్టింది. అయితే ట్విట్టర్ వేదిక …
Read More »ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన నిర్ణయం
అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాల్లోనూ వెనక్కి తగ్గని మోదీ సర్కార్.. అన్నదాతల ఆగ్రహానికి తలొగ్గింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. నూతన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. …
Read More »సాఫ్ సీదా ముచ్చట.. వడ్లు కొంటరా..? కొనరా..?- మోదీకి కేసీఆర్ సూటి ప్రశ్న
రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట. సాఫ్ సీదా ముచ్చట. తెలంగాణలో పండించే వడ్లు కొంటరా..? కొనరా..? అది చెప్పమంటే.. మేం మరాఠీలో అడిగామా? ఉర్దూలో అడిగామా? అర్థం కాని భాషలో అడిగామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ …
Read More »అవసరమైతే ఢిల్లీకి యాత్ర – సీఎం కేసీఆర్
అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ యుద్ధాన్ని ప్రారంభించాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నాలో కేసీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ నగరంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. అవసరమైతే ఢిల్లీ వరకు కూడా యాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడిదాకా అయినా సరే పోయి …
Read More »ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఈనెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాలకు సంబంధించి పార్లమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ సమావేశాల్లో కేంద్రాన్ని పలు అంశాలపై ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. లఖింపూర్, నామమాత్రంగా తగ్గించిన ఇంధన ధరలు, డ్రగ్స్ సరఫరా, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
Read More »ఇందిరా పార్క్ దగ్గర TRS మహాధర్నా
తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద అధికార టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించనుంది. ఈ మహాధర్నాలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉ. 11గం.- మ. 2గం. వరకు ధర్నాచౌక్ పార్టీ ముఖ్యనేతలంతా బైఠాయించనున్నారు. ధర్నా అనంతరం రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ తమిళ సై కి వినతి పత్రం సమర్పించనున్నారు. …
Read More »మా వడ్లు కొంటరా.. కొనరా? సేకరణపై స్పష్టతనివ్వండి
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత బియ్యం కొనుగోలు చేస్తారో స్పష్టతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం ప్రధానికి రెండు పేజీల లేఖను రాసిన కేసీఆర్.. వ్యవసాయరంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, పెరిగిన దిగుబడి గురించి వివరించారు. అదే సమయంలో దేశంలో ఆహార భద్రత కల్పనలో కేంద్రం బాధ్యతను విస్మరించరాదని పేర్కొన్నారు. ఈ లేఖను కేంద్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి …
Read More »ఢిల్లీ పాలకులకు బుద్ధి చెప్పాలి..
ఒక తండ్రి తన పిల్లలందరిని సమాన దృష్టితో చూస్తాడు. కానీ ఇప్పుడు దేశంలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ర్టాల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. తండ్రి పాత్ర పోషించాల్సిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ర్టాల మధ్య వివక్ష చూపుతున్నది. తెలంగాణ రైతు పండించిన వడ్లు కొనడానికి నిరాకరిస్తున్నది. పైగా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు వరి వేసుకోవాలంటూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విధానం. తెలంగాణ …
Read More »కేసీఆర్ ఆగ్రహ జ్వాలల్లో బీజేపీ భస్మం
పుష్కరం పాటు ఒక జాతి మొత్తాన్ని ఏకం చేసి పదమూడేళ్లపాటు మహోద్యమాన్ని నడిపి, ఆ ఉద్యమ ఫలాన్ని అందుకున్న ఏకైక నాయకుడు భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానికి తరువాత ఒక్క కేసీఆర్ మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. ప్రత్యేకరాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రశాంతంగా పాలన చేసుకుంటూ రాష్ట్రాన్ని స్వల్పకాలంలోనే దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాంటి దార్శనికుడు మళ్ళీ మరోసారి ఉద్యమబాట పట్టి కేంద్రం కర్రపెత్తనం మీద …
Read More »ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి-బీవీ రాఘవులు
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.ఎక్కువ ధాన్యం పండించే రాష్ర్టాలకు కేంద్రం తీవ్రమైన అన్యాయం చేస్తున్నదని, దీనివల్ల తెలంగాణ ఇబ్బందుల పాలవుతున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు …
Read More »