తెలంగాణలోని హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు మొదలైంది. బుధవారం హుజూరాబాద్ ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులతో భేటీ కారున్నారు. కోవిడ్ కారణంగా మూడు నెలలుగా నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలోకి ఈటల రాజేందర్ రాకతో కాకరేగుతోంది. ఈటల చేరికను పెద్దిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మూడు నెలల తర్వాత ఆయన ఇవాళ హుజూరాబాద్‌కు వస్తున్నారు. కార్యర్తలు, అనుచరులు, సన్నిహితులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచారణపై …
Read More »ఎమ్మెల్యే చల్లా సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలం మాదన్నపేట,వంగపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరడం జరిగింది.గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో మాదన్నపేట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కొత్తకండ రాజేందర్,వార్డు మెంబర్లు ఎండి షేక్,దుబ్బాకుల సారంగపాని,వంగపల్లి గ్రామ అధ్యక్షులు చిలువేరు జగదీష్,మండల …
Read More »అవినీతిపరుల అడ్డాగా మారిన బీజేపీ…
అవినీతిపరులకు అడ్డాగా బిజెపి మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మంగళవారం కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో టి.ఆర్.ఎస్.పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనులపై,పార్టీ స్థితిగతులపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి పేరియాల రవీందర్,మండల,గ్రామ ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More »ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకొన్న మాజీ మంత్రి ఈటల
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి చెల్లని పైస గా మారిపోయింది. తనను తాను ఓ బడా నాయకుడిగా ఊహించుకొన్న ఆయన పతార ఏపాటిదో ఢిల్లీలో తేలిపోయింది. బీజేపీలో చేరడానికి ప్రత్యేక విమానంలో వెళ్లిన ఈటలను ఆ పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోనేలేదు. అగ్రనేత అమిత్‌షా మా ట దేవుడెరుగు.. కనీసం ముందుగా అనుకున్న ప్ర కారం రావాల్సిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. …
Read More »కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హారీష్ ఫైర్
తెలంగాణలోని భూముల అమ్మకంపై కాంగ్రెస్, బీజేపీలు అనవసరమైన రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయి అని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. భూముల అమ్మకంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. దీంతో సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు నిరర్ధక ఆస్తులు అమ్ముతామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పాము. పూర్తి పారదర్శకంగా భూములు అమ్మటం జరుగుతుంది …
Read More »MLA పదవీకి ఈటల రాజీనామా
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు. కాగా.. నేటి సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో …
Read More »ఈటల రాజీనామాకు ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మొదట.. నగరంలోని గన్‌పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి …
Read More »వ్యాక్సిన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవే…
దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. జాతీయ టీకా కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. జూన్ 21లోపు రెండు వారాల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. జనాభా, కరోనా కేసులను బట్టి రాష్ట్రాలకు టీకాలను కేటాయించనున్నట్టు వెల్లడించింది. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్ …
Read More »జంగారెడ్డిగూడెం అభివృద్ధి లో కీలకం కానున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ ప్రాజెక్ట్”
“జంగారెడ్డిగూడెం అభివృద్ధి లో కీలకం కానున్న జాతీయ ప్రాజెక్ట్” ప్రధానమంత్రి భారతీ మాల పథకంలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొదటగా ప్రారంభం కానున్న ” ఖమ్మం- దేవరపల్లి” గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పశ్చిమగోదావరి మెట్ట ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నది. సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం ప్రాంతాలకు జాతీయ రహదారి వరం కానున్నది. మా ప్రాంతంలో జాతీయ రహదారులు ఉన్నాయిగా …
Read More »మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరికపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలో ఉన్నట్లే బీజేపీలో కూడా గ్రూపులు ఉన్నాయన్నారు. అయితే ఈటలతోపాటు కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పార్టీలో చోటులేదన్నారు. చేరికలను వ్యతిరేకిస్తే వాళ్లకే నష్టమని రాజాసింగ్ అన్నారు. ఈటల బీజేపీలోకివస్తే …
Read More »