తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు …
Read More »బీజేపీలోకి పీటీ ఉష
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న కేరళలో ప్రభావం చూపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఆకర్షించిన కాషాయ దళం ఇప్పుడు ఒకప్పటి పరుగుల రాణి పీటీ ఉషను తమ పార్టీలోకి చేర్చుకోనుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా గళం విన్పించిన ఉష సహా పలువురు ప్రముఖులు త్వరలోనే బీజేపీలో చేరుతారని కేరళలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్. రామచందర్ రావు నామినేషన్ దాఖలు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,సీఎం కేసీఆర్ కుటుంబం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుందని. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే శాసన మండలిలో అన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వరదలపై మూడేళ్ల క్రితమే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశానని వెల్లడించారు.
Read More »ఏపీలో హైవేల కోసం రూ.4,459కోట్లు
ఏపీలో హైవేల నిర్మా ణం, మరమ్మతులు, ఆధునీకరణకు 2021-22 బడ్జెట్‌లో రూ. 4459.52 కోట్లు కేటాయించినట్టు కేంద్ర జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. పనులు ప్రారంభమైన రహదారులకు రూ.2,070 కోట్లు, మంజూరుకానీ ప్రాజెక్టులకు రూ.130 కోట్లు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టుకు రూ.997.94 కోట్లు, ఎన్‌హెచ్‌డీపీ కింద రూ.1261.46 కోట్లను ప్రతిపాదించినట్టు పే ర్కొంది. కాగా, ఎన్‌హెచ్ 165పై పామర్రు-ఆకివీడు రోడ్డుకు రూ.200 కోట్లు, మడకశిర నుంచి ఏపీ-కర్ణాటక సరిహద్దు …
Read More »తెలంగాణలో హిందూ రాజ్యం స్థాపిస్తాం -బండి సంజయ్
2023లో తెలంగాణలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ అన్నారు. భవిష్యత్ లో గోల్కొండ కోటపై ఎగిరేది కాషాయ జెండానేనన్నారు. తెలంగాణలో ఖాసీం రజ్వీ వారసుల రాక్షస పాలన సాగుతుందన్న ఆయన.. హిందువులందరూ ఓటు బ్యాంకుగా మారాలన్నారు. నిఖార్సైన హిందువుననే సీఎం కేసీఆర్ శివాజీ జయంతి వేడుకలు ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు
Read More »ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనిప్రకారం మార్చి 10 పోలింగ్ జరుగనుండగా, అదేనెల 14న ఓట్లను లెక్కిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులపాటు సమయం ఇచ్చారు. ఈ ప్రక్రియ మార్చి 2న ప్రారంభమై 3న మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది.
Read More »కుప్పకూలిపోయిన గుజరాత్ సీఎం
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వడోదర ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా.. వేదికపై కుప్పకూలారు వెంటనే గమనించిన సిబ్బంది, బీజేపీకి చెందిన నేతలు ఆయన్ను పట్టుకున్నారు.. అనంతరం ప్రథమ చికిత్స అందించి, అహ్మదాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. గత కొన్ని రోజుల నుంచి విజయ్ రూపానీ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. కాగా ఈ నెల 21న పలు కార్పొరేషన్లకు, 28న మున్సిపాలిటీలు పంచాయతీలకు …
Read More »రామ మందిర నిర్మాణానికి రూ 1500 కోట్లకు పైగా విరాళాలు
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఇప్పటివరకూ రూ 1500 కోట్లకు పైగా విరాళాలు వసూలయ్యాయి. మందిర నిర్మాణానికి జనవరి 15న ప్రారంభమైన విరాళాల సేకరణ కార్యక్రమం ఈనెల 27తో ముగుస్తుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. అయోధ్యలో అద్భుతంగా నిర్మించే రామాలయ నిర్మాణానికి దేశం యావత్తూ నిధులను అందిస్తోందని ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. విరాళాల సేకరణ …
Read More »హద్దుమీరితే తొక్కేస్తాం
మేం తలచుకుంటే దుమ్ముదుమ్మైపోతరు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణను అరిగోస పెట్టిన లఫంగిపార్టీ.. దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు అధికా రం ఇచ్చారని.. ఏ ఢిల్లీవోడో నామినేట్ చేస్తేనో. ఇంకెవడో ఇస్తేనో రాలేదని పేర్కొన్నారు. ఏండ్లు గా తెలంగాణ ఈ దుస్థితికి రావడానికి కారణమైన కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హతే లేదని చెప్పారు. రాష్ర్టానికి అన్యాయం …
Read More »బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పవన్ భేటీ
దేశ రాజధాని నగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ BJP చీఫ్ JP నడ్డాతో ఇవాళ భేటీ కానున్నారు. ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, తిరుపతి ఉపఎన్నికలో పోటీపై క్లారిటీ రానున్నది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం రాజుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరుగుతుందని సమాచారం.
Read More »