కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సర్కారు ‘కరోనా’ పన్ను విధిస్తుందనే వార్తలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. కరోనాకు సంబంధించి పన్ను/సెస్ విధించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇటీవల బడ్జెట్ దేశంలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందన్నారు. గత 3 నెలల్లో GST ఆదాయం పెరిగిందన్నారు దేశాభివృద్ధి కోసం SBI వంటి పరిమాణంలో మరో 20 సంస్థల అవసరం ఉందన్నారు.
Read More »విజయశాంతి వార్నింగ్.. ఎవరికి..?
తెలంగాణ బీజేపీకి చెందిన కార్యకర్తలకు ఉద్యమాలు, అరెస్టులు కొత్త కాదని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు.పరకాల అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి వేధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలను మాత్రం అరెస్టు చేయలేదని ఆరోపించారు. తాము తెగిస్తే జైళ్లు సరిపోవన్నారు.టీఆర్ఎస్ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అవసరమైతే వరంగల్ …
Read More »ఇండియా సెలబ్రేటీలకు లాయర్ ప్రశాంత్ భూషన్ దిమ్మతిరిగే కౌంటర్
రైతు ఆందోళనల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు తలదూర్చడాన్ని వ్యతిరేకిస్తూ సచిన్ చేసిన ట్వీట్కు ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కౌంటరిచ్చారు. రైతుల దీక్షలో కరెంట్, నీళ్లు, ఇంటర్నెట్ సేవలను కట్ చేసినప్పుడు, బీజేపీ మద్దతుదారులు రాళ్లు విసిరినప్పుడు వీళ్లంతా ఏమయ్యారు? . రిహాన్నా, గ్రెటా ట్వీట్లు చేసేసరికి అందరూ నోళ్లు తెరుస్తున్నారు. వీళ్లంతా వెన్నెముక లేని మనసు లేని సర్కారు సెలబ్రిటీలు’ అని కౌంటర్ ఇచ్చారు
Read More »రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త
వన్ నేషన్-వన్ కార్డును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ కార్డు విజయవంతంగా అమలవుతోందని నిర్మలా చెప్పారు.
Read More »ఆ పథకాన్ని మరో ఏడాది పొడిగించిన కేంద్రం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దీంతో 2022 మార్చి 31 వరకు గృహాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలను పొందవచ్చు. అలాగే అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం మరో ఏడాది పెరగనుంది. 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇంటి రుణాలు తీసుకున్న వారికి వడ్డీపై కేంద్రం రాయితీ అందిస్తోంది.
Read More »సామాన్యుడికి షాకిచ్చిన 2021-22కేంద్ర బడ్జెట్
బడ్జెట్ లో సామాన్యుడికి ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.2.5, లీటర్ డీజిల్పై రూ.4 అగ్రి సెస్ విధిస్తున్నట్లు ప్రతిపాదనలు చేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు చేరింది
Read More »కేంద్ర బడ్జెట్ 2021-22తో ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే..?
-తగ్గనున్న బంగారం, వెండి ధరలు -పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు -మొబైల్ రేట్లు పెరిగే అవకాశం -నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం -సోలార్ ఇన్వర్టర్లపై పన్ను పెంపు -ఇంపోర్టెడ్ దుస్తులు మరింత ప్రియం
Read More »వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఎందుకంటే..?
దేశంలోని లబ్ధిదారుల సౌకర్యం కోసమే దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను అమల్లోకి తెచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పథకంవల్ల లబ్ధిదారుడు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా మరే ఇతర ప్రాంతం లేదా రాష్ట్రం నుంచైనా సరుకులు తీసుకునే సౌకర్యం కలిగిందని ఆమె తెలిపారు. ముఖ్యంగా బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికులకు ఈ పథకం …
Read More »స్వస్త్ భారత్ హెల్త్ స్కీమ్ కి ఎన్ని కోట్లు కేటాయించారంటే..?
ఆరోగ్య భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఆత్మనిర్బర్ స్వస్త్ భారత్ యోజన పేరుతో ఆ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. ఈ కొత్త పథకం కోసం 64,180 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆరేళ్ల పాటు ఆ స్కీమ్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ ఆమె లోక్‌సభలో బడ్జెట్ …
Read More »కేంద్ర బడ్జెట్ 2021 -రైల్వేలకు రూ.1.15 లక్షల కోట్లు
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ రైల్వేలను అభివృద్ది చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ నిర్ణయించింది. అందుకోసం రైల్వే రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.1.15 లక్షల కోట్ల నిధులు అందించనున్నారు. దేశీయ విమానాశ్రయాలను పూర్తిగా ప్రైవేటీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Read More »