దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. వైరస్ వ్యాప్తి రోజు రోజుకు ఉధృతమవుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది. వరుసగా దేశంలో నాలుగో రోజు రెండు లక్షలకుపైగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.గతంలో ఎన్నడూ లేని విధంగా 1,501 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,38,423 మంది …
Read More »తెలంగాణలో కరోనా విజృంభణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో ప్రభుత్వం ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 1,29,637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 5093 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. వైరస్ బారినపడినవారిలో 15 మంది మరణించగా, మరో 1555 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3.51 లక్షలకు చేరాయి. ఇందులో 3.12 లక్షల మంది డిశ్చార్జీ అవగా, 1824 …
Read More »ఆంధ్రప్రదేశ్ లో కరోనా విశ్వరూపం
ఆంధ్రప్రదేశ్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 6,096 కేసులు వచ్చాయి. 24 గంటల్లో కరోనాతో 20మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరులో 5, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,48,231కు చేరింది. మృతుల సంఖ్య 7373కి చేరింది.
Read More »తెలంగాణలో కరోనా విలయ తాండవం
తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4446 కరోనా కేసులు నమోదవగా మరో 12 మంది బాధితులు మరణించారు. 1414 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3.46 లక్షలకు చేరింది. ఇందులో 1,809 మంది బాధితులు వైరస్‌వల్ల మరణించగా, మరో 3.11 లక్షల మంది డిశ్చార్జీ అయ్యారు. …
Read More »మహారాష్ట్రలో కరోనా విలయతాండవం
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 61,695 పాజిటివ్ కేసులు రాగా, 349 మంది చనిపోయారు. 53,335 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 36.39లక్షలను చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6.20 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కరోనా కల్లోలం
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గురువారం 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 బారిన పడి మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి మరో 1,038 మంది మృతువాతపడ్డారు. కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం …
Read More »తెలంగాణలో కొత్తగా 3,037 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరాయి. ఇందులో 1788 మంది బాధితులు వైరస్‌వల్ల మరణించగా, మరో 3,08,396 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 27,861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 18,685 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా …
Read More »భారత్ లో కరోనా విలయం
ప్రస్తుతం మన దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. రెండోదశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 1.68 లక్షల కేసులు నమోదవగా.. తాజాగా 1.61లక్షలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,61,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ …
Read More »దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కరోనా కలకలం
దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టురూమ్‌లతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని అన్ని బెంచీలు ఒక గంట ఆలస్యంగా విచారణలు మొదలుపెట్టనున్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 2251 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకింది. కొత్తగా 565 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, మరో ఆరుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,29,529కి చేరింది. ఇప్పటివరకు 1765 మంది మరణించగా, 3,05,900 మంది …
Read More »