Home / Tag Archives: carona cases

Tag Archives: carona cases

మీరు ఆ మాస్కులనే వాడుతున్నారా..?

వస్త్రం (క్లాత్)తో తయారు చేసిన మాస్కుల కంటే N95 లేదా KN95 మాస్కులు శ్రేయస్కరమని అమెరికా మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫహీమ్ యూనస్ చెప్పారు. రెండు N95 లేదా KN95 మాస్కులు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాలని సూచించారు. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగులో ఉంచి మరుసటి రోజు వాడాలన్నారు. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చన్నారు. వస్త్రంతో చేసిన మాస్కులు ధరించవద్దన్నారు.

Read More »

హీరోయిన్ తో పాటు కుటుంబానికి మొత్తం కరోనా

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. సెల‌బ్రిటీల‌ను సైతం క‌రోనా గ‌జ గ‌జ వ‌ణికిస్తుంది. రీసెంట్‌గా బాలీవుడ్ న‌టి సమీరా రెడ్డి క‌రోనా బారిన ప‌డింది. ఆదివారం రోజు తాను క‌రోనా బారిన ప‌డిన‌ట్టు తెలియ‌జేసిన స‌మీరా ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. నా ముఖం మీద చిరున‌వ్వు తీసుకొచ్చే ఎంద‌రో నా చుట్టూ ఉన్నారు. ఈ స‌మ‌యంలో పాజిటివ్‌గా దృడంగా ఉండాల‌ని పేర్కొంది. అయితే సోమ‌వారం ఉద‌యం నెటిజ‌న్స్ స‌మీరా పిల్ల‌ల …

Read More »

ఢిల్లీలో 7రోజులు లాక్‌డౌన్

దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈరోజు నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్‌డౌన్ ఈ రోజు(సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల వరకూ కొనసాగనుంది. కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు ఉదయం …

Read More »

ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదు : మంత్రి ఈటల

కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్‌కే భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.కరోనా తగ్గిందనుకున్న సమయంలో రెండో వేవ్‌ మొదలైందని అన్నారు. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ బారినపడిన వారిలో 5 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘45 సంవత్సరాలు నిండిన …

Read More »

మహారాష్ట్రలో కరోనా విజృంభణ

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజే 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇవాళ 56,783 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6,47,933 యాక్టివ్ కేసులున్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా కరోనాతో మహారాష్ట్రలో ఇప్పటివరకు 59,970 మరణాలు సంభవించాయి.

Read More »

దేశంలో కరోనా కల్లోలం

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. వైరస్‌ వ్యాప్తి రోజు రోజుకు ఉధృతమవుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది. వరుసగా దేశంలో నాలుగో రోజు రెండు లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,61,500 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.గతంలో ఎన్నడూ లేని విధంగా 1,501 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,38,423 మంది …

Read More »

తెలంగాణలో క‌రోనా విజృంభణ

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ది. దీంతో ప్ర‌భుత్వం ముమ్మ‌రంగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 1,29,637 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 5093 మంది క‌రోనా పాజిటివ్‌లుగా నిర్ధార‌ణ అయ్యారు. వైర‌స్ బారిన‌ప‌డిన‌వారిలో 15 మంది మ‌ర‌ణించ‌గా, మ‌రో 1555 మంది బాధితులు మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3.51 ల‌క్ష‌ల‌కు చేరాయి. ఇందులో 3.12 ల‌క్ష‌ల మంది డిశ్చార్జీ అవ‌గా, 1824 …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విశ్వరూపం

ఆంధ్రప్రదేశ్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 6,096 కేసులు వచ్చాయి. 24 గంటల్లో కరోనాతో 20మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరులో 5, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,48,231కు చేరింది. మృతుల సంఖ్య 7373కి చేరింది.

Read More »

తెలంగాణలో కరోనా విలయ తాండవం

తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా  క‌రోనా కేసులు రోజురోజుకు అధిక‌మ‌వుతున్నాయి. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 4446 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా మ‌రో 12 మంది బాధితులు మ‌ర‌ణించారు. 1414 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3.46 ల‌క్ష‌ల‌కు చేరింది. ఇందులో 1,809 మంది బాధితులు వైర‌స్‌వ‌ల్ల మ‌ర‌ణించ‌గా, మ‌రో 3.11 లక్ష‌ల మంది డిశ్చార్జీ అయ్యారు. …

Read More »

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 61,695 పాజిటివ్ కేసులు రాగా, 349 మంది చనిపోయారు. 53,335 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 36.39లక్షలను చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6.20 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »