దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గతేడాది ఈ మహమ్మారి పెద్దలపై విరుచుకుపడగా, సెకండ్ వేవ్‌లో మాత్రం చిన్నారులపై కోరలు చాచి బుసలు కొడుతోంది. నెల రోజుల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా 79,688 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో ఒక్క మహారాష్ర్టలోనే 60,684 మంది చిన్నారులకు కరోనా సోకింది. …
Read More »త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా ఆయన ఒక ట్వీట్‌లో వెల్లడించారు. తనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. కరోనా నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరాయి. ఇందులో 1734 మంది కరోనాతో మృతిచెందారు. మరో 3.03 లక్షల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 11,617 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …
Read More »దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 1,15,736 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. అలాగే పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. కొత్తగా 59,856 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు …
Read More »సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఆయనే పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ కోరారు. ఇవాళ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కు పెరిగింది. మహమ్మారి ప్రభావంతో మరో 446 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 50,143 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 7,88,223కు చేరాయి. ఇప్పటి వరకు 1,17,32,279 …
Read More »తెలంగాణలో కరోనా కలవరం
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గం.8 వరకు కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,237కు చేరాయి. ఇక నిన్న ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,723కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 268 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 8,746 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఏపీలో తగ్గని కరోనా కేసులు
ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది రాష్ట్రంలో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో 30,678 శాంపిల్స్ పరీక్షించారు.. వీటిలో 1,326 కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,09,002కి చేరింది. ఇక తాజాగా ఐదుగురు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 7,244కి చేరింది. ప్రస్తుతం 10,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8,91,048 మంది కరోనా నుంచి కోలుకున్నారు
Read More »మాస్కు లేని వారికి 1,000 జరిమానా
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా విజృంభణతో ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే రూ. 1,000 జరిమానా విధిస్తోంది. మొక్కుబడిగా సగం మాస్కు ధరించినా జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు. మాస్కు ముక్కు, నోటిని కవర్ చేసే విధంగా కాకుండా కేవలం నోటికి లేదా గదవ దగ్గర మాత్రమే ధరించినా మాస్కు లేని వారిగానే పరిగణిస్తారు. వారు కూడా రూ. 1,000 …
Read More »మహారాష్ట్రలో కొత్తగా 31,643 కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. అక్కడ కొత్తగా 31,643 కరోనా కేసులు, 102 మరణాలు నమోదయ్యాయి దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,45,518కు, మరణాల సంఖ్య కు చేరింది. అలాగే ముంబై ఒక్క చోటే 5,890 కరోనా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు
Read More »