నిన్న మొన్నటి వరకు కరోనాతో ఆగమాగమైన యావత్ ప్రపంచం తాజాగా బ్రిటన్ లో చోటు చేసుకున్న స్ట్రెయిన్ కరోనాతో ఆగమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. తాజాగా ఆ కరోనా లక్షణాలు ఉన్న ఏపీకి చెందిన ఒక మహిళ క్వారంటైన్ నుండి తప్పించుకుని రాజమండ్రికి చేరుకోవడంతో అక్కడ కాస్త గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. ఏది ఏమైనప్పటికి అది సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడమే మనముందు ఉన్న ప్రధాన కర్తవ్యం. అసలు ఈ వ్యాధి …
Read More »తెలంగాణలో తొలిదశలో 40,095 మందికి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలోకరోనా వ్యాక్సిన్ పంపిణీకి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి విడతలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందికి ఇస్తారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటికే 40,095 మంది ఉన్నట్లు గుర్తించారు. PHC స్థాయిలో వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్ జిల్లాలో 146, రంగారెడ్డి జిల్లాలో 60 కేంద్రాలు గుర్తించి నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నారు
Read More »తెలంగాణలో కొత్తగా 574 కరోనా కేసులు
తెలంగాణలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 574 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,83,556గా ఉంది. అటు నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,524కు చేరింది. నిన్న కరోనా నుంచి 384 మంది కోలుకున్నారు ఇప్పటివరకు 2,75,217 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జవగా ప్రస్తుతం 6,815 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 23,950కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం 23,950కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కి చేరుకుంది. ఇందులో మొత్తం యాక్టివ్ కేసులు 2,89,240. మొత్తం కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 96,63,382. తాజాగా కరోనాతో 333మంది మృత్యు వాత పడ్డారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు1,46,444మంది మరణించారు.
Read More »కొత్త రకం కరోనాపై డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ
బ్రిటన్‌లో బెంబేలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ అదుపులోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలతో ఆ వైరస్ దూకుడును అడ్డుకోవచ్చు అని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. బ్రిటన్‌లో కొత్త కరోనా శరవేగంగా విస్తరిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. కొత్త వైరస్ వ్యాప్తి రేటు అధికంగానే ఉన్నా.. ప్రస్తుతానికి మాత్రం కంట్రోల్‌లోనే ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై 2 తర్వాత ఈ స్థాయిలో తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116కు చేరింది. కొత్తగా 30,376 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 96,36,487 కోలుకున్నారు. మరో 301 మృతి …
Read More »బ‌్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వెర్షన్
బ‌్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వణికిస్తోంది. పరిస్థితి చేయిదాటి పోయిందంటూ ఏకంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రే చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా, కెనడా, ఇటలీలాంటి దేశాలు నిషేధం విధించాయి. కరోనా కొత్త వేరియంట్ తమ దేశాల్లో అడుగుపెట్టకుండా వీళ్లు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం …
Read More »తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో 316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. తాజాగా వైరస్ నుంచి 612 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,73,625 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1515కు చేరింది. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉందని, రికవరీ …
Read More »24గంటల్లో దేశంలో 25,153 కరోనా పాజిటివ్ కేసులు
గడిచిన 24గంటల్లో దేశంలో 25,153 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మార్క్‌ను దాటింది. అమెరికా తర్వాత కోటి కరోనా వైరస్ కేసులను దాటిన రెండో దేశంగా భారత్ నిలిచింది. జనవరి 30న కేరళలో తొలికేసు నమోదైన నుంచి ఇప్పటి నుంచి 95.5లక్షల మంది కోలుకున్నారు. తాజాగా 347 మంది వైరస్‌కు బలవగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,45,136కు …
Read More »ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 506 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 63,873 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 506 మంది వైరస్ బారినపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరులో 104, గుంటూరులో 69, పశ్చిమగోదావరిలో 66, కృష్ణాలో 59 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,75,531 మంది కరోనా బారినపడగా, 8,63,508 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,966 మంది చికిత్స పొందుతున్నారు. …
Read More »