అమెరికాలో కరోనా రెండో వేవ్ మొదలైనట్లు ఉంది. కేవలం ఒక్కరోజులోనే ఏకంగా మూడు లక్షల కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 3,976మంది కరోనా భారీన పడి మృతి చెందారు. అయితే కరోనా మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్కరోజులోనే అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. అంతకుముందు రోజు కూడా ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల మంది కరోనాతో చనిపోయారు. …
Read More »తెలంగాణలో కొత్తగా 417 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 417 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 472 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల కేవలం ఇద్దరు మాత్రమే మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,410గా ఉంది. మొత్తం రికవరీలు 2,81,872 మంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల …
Read More »దేశంలో తాజాగా 16వేల కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి 16 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఈరోజు 9 శాతం తక్కువ కేసులు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,505 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,03,40,470కు చేరింది. ఇందులో 2,43,953 మంది బాధితులు …
Read More »కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది..
ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్తోపాటు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అత్యవసర సమయంలో పరిమిత వినియోగానికి అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన డీసీజీఐ అధికారులు.. ఈ మేరకు రెండు టీకాల వినియోగానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. …
Read More »డ్రై రన్ వ్యాక్సిన్ అంటే ఏమిటి..?
డమ్మీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియనే డై రన్ అంటారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. ఇది మాక్ డ్రిల్ లాంటిదే. వ్యాక్సిన్ పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం,లోపాలను గుర్తించేందుకు డై రన్ నిర్వహిస్తారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, లబ్ధిదారుల ఎంపిక, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ వేయాలా? వద్దా? అని నిర్ణయించటం తదితర అంశాలను ఇందులో పరిశీలిస్తారు
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,078 కేసులు, 224 మరణాలు 8,29,964 కరోనా టెస్టులు చేయగా 19,078 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,05,788కి చేరింది. నిన్న 224 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందగా మొత్తం 1,49,218 మంది ప్రాణాలు విడిచారు గత 24 గంటల్లో 22,926 మంది కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 99,06,387కు చేరింది. ప్రస్తుతం 2,50,183 …
Read More »తెలంగాణలో 293 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో గత రాత్రి గం.8 వరకు కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య 2,87,108కు చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,546కు పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 535 మంది కోలుకోగా మొత్తం 2,79,991 మంది డిశ్చార్జయ్యారు ప్రస్తుతం 5,571 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న రాష్ట్రవ్యాప్తంగా 26,590 టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య …
Read More »దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటి కంటే ఇవాళ 25 శాతం పెరిగినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కొత్తగా 20,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 286 మంది చనిపోయారు. 26,572 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 1.02 కోట్లకు చేరుకోగా, కరోనాతో 1.48 లక్షల మంది మృతి చెందారు. కొత్త రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య …
Read More »ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 212 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 8,81,273కు చేరింది. 7,098 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 3,423 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 8,70,752 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో …
Read More »ఇండియాలో కొత్త స్టెయిన్ కరోనా కేసుల కలవరం
ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా కొత్త వైరస్ ఇండియాను తాకింది. దేశవ్యాప్తంగా మొత్తం 6 కొత్త స్టెయిన్ కేసులు నమోదయ్యాయి. ప్రధాన నగరాలైన బెంగళూరులో 3, హైదరాబాద్ లో 2 పుణెలో ఒక కేసు చొప్పున వెలుగుచూశాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటికే వరంగల్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు CCMB నిర్ధారించిందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »