Home / Tag Archives: carona possitive (page 63)

Tag Archives: carona possitive

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు నానాటికి రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసులు 1,69,60,172 పెరిగాయి. మరో 2,767 మంది మరణించగా, మృతుల సంఖ్య 1,92,311కు చేరింది. దేశవ్యాప్తంగా 1,40,85,110 మంది కోలుకోగా, ప్రస్తుతం దేశంలో 26,82,751 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్

గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,259 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 97,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.

Read More »

తెలంగాణలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

వ్యాక్సిన్‌ పంపిణీపై తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నవారికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఏపీ సర్కార్ శుక్రవారం ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు 30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించిన సర్కార్.. ఇక …

Read More »

GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని  GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,464 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 95,919 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు …

Read More »

తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. సెకండ్‌ వేవ్‌లో రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,432 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి మరో 33 మంది ప్రాణాలను కోల్పోయారు. మహమ్మారి బారి నుంచి 2,152 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ …

Read More »

వైద్యారోగ్య శాఖ‌కు సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు..

‌తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్.. వైద్యారోగ్య శాఖ‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్ల‌లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్ర‌స్తుతం వేస‌వి కాలం కావ‌డం, దీనికి తోడు అన్ని ఆస్ప‌త్రులు క‌రోనా రోగుల‌తో నిండి ఉన్న నేప‌థ్యంలో అగ్నిప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌న్నారు. రోగులు ఎక్కువ ఉన్న …

Read More »

ఆ గ్రామంలో సగం మందికి కరోనా ..!

క‌ర్ణాట‌కలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. నగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు కూడా క‌రోనా ప్ర‌బ‌లుతున్న‌ది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా అమ‌నహళ్లి గ్రామంలో కరోనా క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. అమనహళ్లిలో 300 మంది జనాభా ఉండ‌గా, ఇటీవల ఆ గ్రామంలో అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో మొత్తం 144 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దాంతో గ్రామంలో దాదాపు సగం మందికి కొవిడ్‌ …

Read More »

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో

దేశంలోనే తొలిసారిగా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కోసం తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం యుద్ధ విమానాల‌ను ఉప‌యోగిస్తోంది. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌తో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌కు ఈ ఉద‌యం బ‌య‌ల్దేరి వెళ్లాయి. 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను భువ‌నేశ్వ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు యుద్ధ విమానాలు తీసుకురానున్నాయి.

Read More »

తెలంగాణలో కరోనా విజృంభణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్‌ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌బులిటెన్‌లో తెలిపింది. అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ …

Read More »

మంత్రి కేటీఆర్ కు కరోనా

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat