తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,798 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు. 2,524 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,561 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 1,30,430 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Read More »దేశంలో కొత్తగా 94వేల కరోనా కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. రాష్ట్రాలు విధించిన ఆంక్షల ఫలితంగా వరుసగా మూడోరోజు లక్షకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 94వేల మందికి కరోనా సోకింది. అయితే బిహార్ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో మృతుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. రికవరీ రేటులో పెరుగుదల, క్రియాశీల కేసులు తగ్గుతుండటం ఊరటనిచ్చే విషయాలు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది._ …
Read More »తెలంగాణలో కొత్తగా 1,813 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మరో 1,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,301 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1,29,896 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Read More »ప్రముఖ గేయ రచయిత కందికొండ కు మంత్రి కేటీఆర్ చేయూత
ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు. …
Read More »ఏపీలో 2 కోట్లు దాటిన కరోనా టెస్ట్‌లు
ఏపీలో 2 కోట్లు దాటిన కరోనా టెస్ట్‌లు జీరో నుంచి 16 నెలల్లో 2,00,39,764 టెస్ట్‌లు చేసిన రాష్ట్రం కరోనా టెస్ట్‌లో ఏపీ బెస్ట్..దేశ సగటు కంటే మెరుగ్గా పరీక్షలు ప్రతి 10 లక్షల జనాభాకు ఆంధ్రప్రదేశ్‌లో 3.75లక్షల పరీక్షలు చేయగా.. దేశ వ్యాప్తంగా 2.67 లక్షల టెస్ట్‌లు మాత్రమే జరిగాయి 2020 మార్చికి ముందు నమూనాలు.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేనిస్థాయి నుంచి.. …
Read More »తెలంగాణలో మరో 10రోజులు లాక్డౌన్
తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి.. నకిరేకల్ మినహా మిగతా నల్లగొండ జిల్లాలో ప్రస్తుత లాక్‌డౌన్ స్థితి కొనసాగింపు
Read More »తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో మరో 15 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,306 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 182 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3,409కు చేరింది.
Read More »తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో మరో 14 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 97,751 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 184 మందికి పాజిటివ్‌గా తేలింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే 100కు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,614 మంది బాధితులు …
Read More »ఏపీలో కొత్తగా 10,373 కరోనా కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 88,441 మందికి కరోనా టెస్టులు చేస్తే 10,373 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 80 మంది కరోనాతో మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 17,49,363కు చేరగా ఇప్పటివరకు 11,376 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 15,958 మంది కరోనాను జయించారు. మొత్తం 16,09,879 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,070 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 18 మంది మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,762 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,89,734కు చేరింది. ఇప్పటికీ 5,57,162 మంది కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకూ కరోనాతో 3,364 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 29,208 ఉన్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 1,38,182 టెస్టుల చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Read More »