Home / Tag Archives: carona virus

Tag Archives: carona virus

కరోనాతో అల్లాడిపోతున్న మహారాష్ట్ర

దేశంలో కరోనా భీభత్సానికి కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్ర కరోనాతో అల్లాడిపోతుంది.రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి.ఈ క్రమంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఆ రాష్ట్రంలో ఏకంగా 40,925 కొత్త కరోనా కేసులు నమోదవ్వడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దాదాపు 20మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది. ఒమిక్రాన్ కేసుల్లోనూ మహారాష్ట్ర నే …

Read More »

తమిళనాడులో కరోనా విలయతాండవం

నిన్న మొన్నటివరకు వరదలతో అతలాకుతలమైన తమిళనాడు తాజాగా కరోనా విలయతాండవంతో అయోమయంలో పడింది ఆ రాష్ట్ర ప్రజల జీవితం.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 8,981కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి వైరస్ వల్ల ఏకంగా 8మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 30,817 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో …

Read More »

సత్యరాజ్ కి కరోనా

సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కరోనా బారిన పడ్డాడు. పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అప్పటి నుంచి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటున్నాడు. కాగా.. గత రాత్రి పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ‘బహుబలి’లో కట్టప్పగా సత్యరాజ్ అందరికి సుపరిచితుడు.

Read More »

పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం

పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇటలీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో 173 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నిన్న కూడా ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 125 మంది కొవిడ్ పాజిటివ్ గా తేలారు.

Read More »

స్టార్ హీరోయిన్ కి త్రిష కరోనా

స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తనకు కోవిడ్ సోకిందని ట్వీట్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే తనకు వచ్చిందని పేర్కొంది. వైరస్ నుంచి వేగంగా కోలుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నానని, దాని వల్ల మేలు జరిగిందని చెప్పింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరింది.

Read More »

దేశంలో కొత్తగా 1,41,986 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ వణుకు పుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,41,986 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. 24వేల కేసులు పెరిగాయి. మహమ్మారితో మరో 285 మంది మృతి చెందారు. పాజిటివ్ రేటు ఏకంగా 9.28%కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4లక్షల 72 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ.. మొత్తం 3కోట్ల 44లక్షల మంది వైరస్ నుంచి కోలుకోగా, 4 లక్షల …

Read More »

కరోనాపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై వేసిన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రూలింగ్ పార్టీతో సహా అన్ని పార్టీలు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి టెస్టులు కూడా పెంచాలని వైద్యశాఖకు సూచించింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటించాలని …

Read More »

తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెంపు

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుగా పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా  రోజుకు సుమారు 40వేల పరీక్షలు చేస్తున్నారు. తాజాగా  ఆ సంఖ్యను లక్షకు పెంచాలని వైద్యారోగ్య శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇంటి వద్దే యాంటీజెన్ టెస్టు చేసుకోవడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు 2 కోట్ల ర్యాపిడ్ …

Read More »

చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ ..?

ప్రస్తుతం కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీని ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో లండన్ కింగ్స్ కాలేజీ దీని లక్షణాలపై అధ్యయనం చేసింది. కొన్ని సింప్టమ్స్ తెలియజేసింది. సాధారణ కోవిడ్ లక్షణాలతో పాటు.. చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ కావొచ్చని తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో ఎరుపు, దురద దద్దుర్లను గమనించాలని సూచించింది.

Read More »

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 979 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,48,873 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు

Read More »