ఆంధ్రప్రదేశ్ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. చంద్రబాబుతో కృష్ణా జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆయన.. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడ రమేశ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు.. యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం అర్జునుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Read More »టీడీపీకి ఎల్ రమణ రాజీనామా
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ గురువారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు రమణ పంపారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా, రాష్ర్ట ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను అని రమణ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన …
Read More »కారు ఎక్కనున్న ఎల్ రమణ
తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు మరో ప్రచారం. ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు సమాచారం …
Read More »మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం
ఏపీకి చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర నాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నం.2లోని హయత్ ప్లాజాలో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీంద్రనాథ్ను అపోలోకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియలేదు. కాగా ఇటీవలే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు.
Read More »తీవ్ర అస్వస్థతకు గురైన తమ్మినేని సీతారాం
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా స్పీకర్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే స్పీకర్ దంపతులకు కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే.
Read More »ఓ దృఢ సంకల్పం ఘన విజయం సాధించి నేటికి రెండేళ్లు
రాజకీయ కుట్రలకు ఎదురు నిలిచిన ఆ గుండె ఘన విజయం సాధించి రెండేళ్లు. ఆ గుండె చప్పుడుకు ప్రత్యర్ధి కోటలు బద్దలై ఇప్పటికీ కోలుకోలేదు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పాలనా పగ్గాలు చేపడితే ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటాయో ఈ రెండేళ్లలో చూశాం. పారదర్శకతతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూస్తున్నాం. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఇంట్లో కూర్చుంటే రాలేదు. …
Read More »AP 2021-22 వార్షిక బడ్జెట్ హైలెట్స్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, …
Read More »చంద్రబాబు వెన్నుపోటుకు బలైన ‘రాజు’
నాటి నాదెండ్ల నుంచి ఎన్టీఆర్, దగ్గుబాటి, జయప్రద, లక్ష్మీపార్వతి, రేణుకాచౌదరి నుంచి నిన్నటి మోత్కుపల్లి నరసింహులు, రేవంత్ రెడ్డి లాంటి వందలాదిమంది చంద్రబాబు కుటిల రాజకీయాలను నమ్మి ఆయన వలలో చిక్కుకుని సర్వనాశనం అయిపోయారు. ఆ తరువాతిరోజుల్లో వారంతా చంద్రబాబు సర్వనాశనమైపోవాలని, పురుగులుపడిపోవాలని బహిరంగంగా దూషించినవారే. మమతా, స్టాలిన్, దేవెగౌడ, కేజ్రీవాల్, కేసీఆర్, లాలూ ప్రసాద్, రాహుల్ గాంధీ, కుమారస్వామి లాంటి నాయకులు అందరూ చంద్రబాబును ఛీ కొట్టినవారే. చివరకు …
Read More »Mp రఘురామ కాళ్లు ఎందుకు రంగు మారాయంటే..?
తనను అరికాళ్లపై కర్రతో, రబ్బరు తాడుతో కొట్టారని రఘురామ రాజు దిగువ కోర్ట్‌లో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎల్లో మీడియా మరియు తెలుగుదేశం జనసేన సంబంధించిన సామాజిక మధ్యమలో దానిని చిలువలు, వలువలు చేసి..ఆ అరికాళ్ల ఫొటోలను పతాక శీర్షికలో ప్రచురించింది. అదే ఫొటోలనే తెలుగు దేశం పార్టీ వైరల్ చేసింది. అయితే..ఇదంతా కట్టు కథేనని…ఆయనకు ఎలాంటి గాయాలూ లేవని హైకోర్ట్ నియమించిన వైద్యుల కమిటీ ఆదివారం తేల్చడంతో ఎల్లో …
Read More »విజయసాయిరెడ్డికి అనిత కౌంటర్
సీఎంల కుమారులు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుస్తుంటే చంద్రబాబు కుమారుడు లోకేశ్ మాత్రం ఓడిపోయారని ఎద్దేవా చేస్తూ YCP ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్కు TDP నేత వంగలపూడి అనిత కౌంటరిచ్చారు. YSR, స్టాలిన్, కేసీఆర్, ములాయం కుమారులు గెలిస్తే.. లోకేశ్ ఓడిపోయారని విజయసాయి ట్వీట్ చేశాడు.. దీనికి అనిత .. ‘మీరు చెప్పిన లిస్టులో జైలుకు వెళ్లిన CM కొడుకు ఒక్కడే.. వాయిదాలు తప్పించుకుని తిరుగుతుంది ఆ ఒక్కడే’ అంటూ …
Read More »