కోతులు చేసే అల్లరి ఇంతాఅంతా కాదు. ఆడుకునే వస్తువుల నుంచి చేతిలోని సంచుల వరకు వేటినీ వదల కుండా ఎత్తుకెళ్తుంటాయి. వాటి చేష్టలతో నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఓ కోతి ఏకంగా కలెక్టర్‌నే ఆటపట్టించింది. అంతేకాకుండా అక్కడున్న అధికారులతో బతిమాలించుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా కలెక్టర్ నవ్‌నీత్ చాహల్ ఉన్నాతాధికారులతో …
Read More »ప్రమీలకు ఫోన్ చేసిన ..కర్నూలు కలెక్టర్
కర్నూలు జిల్లాకు చెందిన అన్నెం జ్యోతి చైనాలోని వుహాన్‌లో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పాటు వచ్చే నెలలో ఆమె వివాహం ఉండడంతో వారి ఆందోళన రెట్టింపవుతోంది. కోవెలకుంట్ల మండలం బిజినవేములకు చెందిన జ్యోతి తల్లి ప్రమీల, తండ్రి అన్నెం మహేశ్వరరెడ్డి. తండ్రి నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. బీటెక్ పూర్తిచేసిన జ్యోతి టీసీఎల్‌లో ఉద్యోగం సాధించి శిక్షణ నిమిత్తం గత ఆగస్టు …
Read More »కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ..!!
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్న కే. శశాంకను కరీంనగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సర్ఫరాజ్ అహ్మద్‌ను ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా నియమించింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా …
Read More »హ్యాండ్ పంపు నుంచి రక్తం
వినడానికి వింతగా.. ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.యూపీలోని హమీర్ పూర్ జిల్లా ఖాజోడి గ్రామంలో హ్యాండ్ పంపు నుంచి నీళ్లకు బదులు రక్తం రావడాన్ని స్థానికులు గమనించి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా అప్పుడప్పుడు మాంసం,ఎముకలు కూడా బయటపడుతున్నాయి అని స్థానికులు చెబుతున్నారు. దీంతో స్థానికులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో బోరును పరిశీలించిన స్థానిక అధికారులు బోరును …
Read More »కళ్లు లేకుంటేనేం.. కల నెరవేర్చుకుంది.. తొలి అంధ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గా చరిత్రకెక్కింది..!
అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో.. పోరాడిన ప్రతి వ్యక్తి గెలుస్తారనేది అంతే సత్యం. తన బతుకులో చీకట్లు ఉన్నాయి కానీ తన గమ్యాన్ని సాధించడంలో కాదని నిరూపించిన ఓ యువతి భారతదేశపు మొట్టమొదటి అంధ ఐఎఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. కళ్లు, కాళ్లు చక్కగా ఉండి ఏమీ చేయలేకపోతున్నాం అని అనుకునేవారికి ఆమె ఆదర్శం. కళ్లు లేకపోయినా ఐఏఎస్ కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలూ …
Read More »సాక్షాత్తూ తహసీల్దార్ ముందే చెప్పులతో దాడి చేసుకున్నఇద్దరు వీఆర్వోలు
గ్రామస్థాయిలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన వీఆర్వోలు విచక్షణ మరిచారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం అన్న మాట మరచి వీధి రౌడీల్లా మారిపోయారు. యుష్టి యుద్ధానికి దిగారు.. చెప్పులతో దాడి చేసుకున్నారు. కోపోద్రిక్తుడైన ఓ వీఆర్వో.. చెవి కొరికి కక్ష తీర్చుకున్నాడు. ఆదివారం ఉదయం కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు మండలం సుంకేసుల వీఆర్వోగా వేణుగోపాల్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఈయనకు వెబ్‌ల్యాండ్‌లో ఆన్‌లైన్ నమోదు చేసే …
Read More »ఆ జిల్లా కలెక్టర్ ను అభినందించిన ..సీఎం జగన్
అనంతపురం జిల్లా కలెక్టర్ ఎన్ సత్యనారాయణను ముఖ్యమంత్రి జగన్ ప్రశంసిచారని వార్త వచ్చింది. ముఖ్యంగా రైతు భరోసా స్కీమ్ ను చక్కగా అమలు చేసి, రైతులందరికి డబ్బులు అందేలా చేశారని ఆయన మెచ్చుకున్నారు .రైతు భరోసాపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 4,81,498 రైతు కుటుంబాలకు భరోసా కింద రూ.390 కోట్లు జమ చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ, బ్యాంకర్ల సహకారంతో భరోసా సమర్థవంతంగా అమలు …
Read More »సీఎం జగన్ ఆగ్రహం..వేంటనే డీజీపీకి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తరపున బాధిత బాలికకి అండగా నిలవాలన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. లైంగిక దాడి …
Read More »పీవీ సింధుతో పెళ్లి చేయకపోతే కిడ్నాప్ చేస్తా..కలెక్టర్ షాక్
ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన పీవీ సింధుతో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వ్యక‍్తి ఏకంగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. అయితే అతగాడు ఆ పిటిషన్‌లో తన వయసు కేవలం16ఏళ్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. వివరాల్లోకి తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు.. పీవీ సింధుతో వివాహం …
Read More »నవంబర్ లో ఆర్మీ ర్యాలీ…ఛలో శ్రీకాకుళం..!
నిరుద్యోగులకు శుభవార్త… నవంబర్ నెల లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. నవంబర్ 7 నుండి 17 వరకు 11రోజులు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తునట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వయంగా చెప్పారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు సంబందిత అధికారులు దీనికి అర్హులని తెలియజేసారు. ఈ మేరకు ఆశక్తిగా ఉన్నవారు ఎవరైనా ఈ నెల 23నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »