ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్నానంటూ రాజకీయంగా పూర్తి విరోధులు అయిన టీడీపీ కాంగ్రెస్‌లు కలిసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సమావేశమై రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట్నుంచి కాంగ్రెస్-టీడీపీ కలిస్తే పార్టీకి దూరమవుతామని చెబుతున్న నేతలు రాజీనామా బాట పడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ …
Read More »బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మాజీ మంత్రి…!
ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఎక్కడిక్కడ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తాంగా టీడీపీ నేతల గూండాగిరి, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత ప్రజాపోరాటాలతో వైసీపీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అనిపిస్తుంది. ఇందులో బాగాంగానే వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ, టీడీపీ అదినేత చంద్రబాబులు భేటీ అయి కలిసి పనిచేయాలన్న నిర్ణయం ప్రభావం …
Read More »కోదండరాంపై టీజేఎస్ నేతలు తిరుగుబాటు
కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితిలో ఆగ్రహజ్వాలలు తారాస్థాయికి చేరాయి. తెలంగాణ ఉద్యమంలో ఏ కాంగ్రెస్, టీడీపీలపై పోరాడామో.. ఇప్పుడు అదే పార్టీలతో కలిసి పనిచేసేందుకు పార్టీ శ్రేణులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నాయి. చంద్రబాబు చెప్తేకానీ టీజేఎస్‌కు స్థానాలు లభించే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నాయి. ఇప్పటిదాకా అంతర్గతంగా రగిలిన మంటలు.. ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన టీజేఎస్ కోర్‌కమిటీ సమావేశంలో ఈ అంశాలపై వాడివేడి చర్చ సాగిందని …
Read More »కాంగ్రెస్ ప్రకటనకు టీడీపీ నేతలు సిగ్గుతో…!
ఓవైపు తమ పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరోవైపు…రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్‌పై నిన్నమొన్నటి వరకూ విరుచుకుపడ్డ చంద్రబాబు అదే కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు పొత్తుకు పెట్టుకోవడానికి ఎక్కడలేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలపడం పట్లరెండు పార్టీల్లోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నేత వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలు సిగ్గుతో తలదించుకునేలా …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు ఏపీ సీఎం చంద్రబాబు బిగ్ షాక్..!
`మనకు పొత్తు ముఖ్యం…సీట్లు కాదు..అవసరమైతే మీరు సీట్లు వదులుకోండి. కాంగ్రెస్ నేతల నిర్ణయానికే మద్దతు ఇవ్వండి తప్ప మీరు మీ అభిప్రాయాలను వెల్లడించవద్దు“ ఎన్నికల వ్యూహ రచనల నేపథ్యంలోగత సోమవారం జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు వేసిన ఆర్డర్. అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ఇంత ఓపెన్‌గా తన పార్టీని పణంగా పెట్టి మరీ …
Read More »తెలంగాణలో బీసీలను తరిమికొడదాం.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఓటమి భయంతోనో, తెలంగాణలో ఎక్కడికక్కడ కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకతతోనో కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశిస్తున్న పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వాట్సాప్ పోస్ట్ తీవ్ర కలకలం రేపుతుంది. బీసీలను, ముదిరాజ్ లను ఉద్దేశించి రోహిత్ రెడ్డి తీవ్రమైన భాషతో దూషించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. “తాండూర్ మన అడ్డా.. బీసీలను, మహేందర్ రెడ్డిని తరిమికొడదాం” అంటూ రెచ్చగొడుతూ చేసిన …
Read More »తెలుగు రాష్ర్టాలకు కాంగ్రెస్, బీజేపీలు తీరని నష్టాన్ని చేస్తున్నాయి…కేటీఆర్
నాలుగున్నరేండ్లలో కారు వేగం బాగుందని, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా డ్రైవర్ ఏకాగ్రతతో కారు నడుపుతున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ సమయంలో ప్రజలు కారులో డీజిల్ పోసి వేగం ఆగకుండా చూడాలని కోరారు. కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు అని పిలుపునిచ్చారు. సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో అగర్వాల్, జైన్, మహేశ్వరీలకు చెందిన వివిధ మార్వాడీ సంఘాల …
Read More »గాంధీభవన్‌లో కలకలం..!
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కలకలం చోటుచేసుకుంది. ఇప్పటిదాక ఒక బలమైన సామాజికవర్గానిదే హవా కొనసాగిన నేపథ్యంలో మరో వర్గం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా పరిణామంపై భగ్గుమంటున్నారు. కాంగ్రెస్‌లో ఆదిపత్యం చెలాయించే వర్గం రాబోయే ఎక్కువ సీట్లలో వారే పోటీ చేస్తారని ప్రచారంలో పెట్టడంతో పాటుగా ఆమేరకు నియోజకవర్గాలనూ ఎంచుకున్నామని అంటున్నారు. దీంతో….కాంగ్రెస్‌లోని బీసీలంతా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వేరే కుంపటి పెట్టి అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. బీసీలకు జనాభా …
Read More »పార్టీని విలీనం చేస్తా-కోదండరాం
కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఏర్పాటుచేసిన ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కిరావటం లేని సంగతి తెలిసిందే. చాలా స్థానాల్లో తామే బలమైన శక్తిగా చెప్పుకొంటుండటంతో పరిష్కారం జటిలమవుతోంది. ఎవరికివారు తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో నిరంతర చర్చలు జరుపుతున్నా.. ఎవరెన్ని సీట్లకు? అందులోనూ ఏయేస్థానాల్లో పోటీచేయాలన్న విషయంలో స్పష్టత రావటంలేదు. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తాము ఆశిస్తున్న సీట్ల వివరాలను కాంగ్రెస్‌కు జాబితారూపంలో అందించాయి.ఇలా ఓ వైపు …
Read More »లీడర్ లేని కాంగ్రెస్.. క్యాడర్ కూడా లేని టీడీపీ..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న శక్తులు మహాకూటమి పేరుతో మళ్లీ ఓట్లడిగేందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పొరపాటునో, గ్రహపాటునో వారు అధికారంలోకి వస్తే తెలంగాణకు కడగండ్లు తప్పవని, తెలంగాణ మళ్లీ తల్లడిల్లిపోవడం ఖాయమని హెచ్చరించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో నిర్వహించిన దసరా సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య …
Read More »