ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కూడా పీడిస్తోంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో పోరుడుతూ తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సయితం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. …
Read More »దర్శకుడు శంకర్ పై మరో కేసు
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న న్యాయవివాదం కొత్త మలుపు తిరిగింది. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ పూర్తి చేసేదాకా శంకర్ ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించకుండా నిలువరించాలంటూ లైకా ప్రొడక్షన్స్ గతంలో చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం స్టేకు నిరాకరించింది. అక్కడ విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిదట. …
Read More »పెళ్లైతే ఏంటి అంటూ రెచ్చిపోతున్న కాజల్
సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు చాలా పద్ధతిగా కనిపిస్తుంటారు. అంతకు ముందులా ఏ క్యారెక్టర్ పెడితే ఆ క్యారెక్టర్ ఒప్పుకోరు. కచ్చితంగా తమకంటూ కొన్ని ఆంక్షలు పెట్టుకుంటారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పెళ్లి, కెరీర్ వేరు అంటున్నారు. రెండూ వేటికవే ప్రత్యేకం అంటున్నారు. దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఉంది అంటూ హితబోధ చేస్తున్నారు. అందులో కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. …
Read More »సినిమాలకు నటి అనిత గుడ్ బై
అప్పుడెప్పుడో వచ్చిన నువ్వునేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అనిత. ఆ తర్వాత పలు తెలుగు, హిందీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ ముంబై భామ 2013లో కార్పోరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని పెండ్లి చేసుకుంది. వీరిద్దరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టగా..ఆ బుడతడి పేరు ఆరవ్ రెడ్డి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటోందట అనిత. ఇదే విషయంపై అనిత మాట్లాడుతూ..నాకు పిల్లలున్నపుడు సినిమా …
Read More »మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు..-టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్
డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దక్షిణాది నటి నైరా షాను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో ముంబై జుహూలోని హోటల్ రూంలో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేపట్టి..నైరా షాతోపాటు ఆమె స్నేహితుడు ఆశిఖ్ సాజిద్ హుస్సేన్ ను అరెస్ట్ చేశారు. సిగరెట్స్ లో చుట్టబడి ఉన్న ఒక గ్రాము గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ అధికారి …
Read More »మాస్టర్ కి నెం 1.. వకీల్ సాబ్ కు 7
2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం విజయ్ నటించిన మాస్టర్ చిత్రం తొలి స్థానంలో నిలిచింది. ఆస్పిర్టన్స్ వెబ్‌సిరీస్, ది వైట్ టైగర్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్ స్టోరీ- ఐదో స్థానంలో నిలవగా, ధనుష్ చిత్రం కర్ణన్- 6, పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ చిత్రం-7, క్రాక్ 9వ స్థానం …
Read More »రాశీ ఖన్నాకి బంఫర్ ఆఫర్
బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అందరి అటెన్షన్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా రాశీఖన్నా నటించే అవకాశం ఉందనే వార్తలు నెట్టింట హల్‌చల్ …
Read More »పవన్ మూవీలో వివి వినాయక్
సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ ఏకే తెలుగు రీమేక్‌లో డైరెక్టర్ వి వి వినాయక్ గెస్ట్‌గా కనిపించబోతున్నాడట. ఒరిజినల్ వర్షన్‌లో డైరెక్టర్ సాచీ క్యామియో రోల్‌లో కనిపించారు. ఇప్పుడు ఇదే రోల్‌లో వినాయక్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈయన గతంలో ‘ఠాగూర్’. ‘నేనింతే’. ‘ఖైదీ నెం. 150’ చిత్రాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వినాయక్ ప్రధాన పాత్రలో …
Read More »పెళ్లిపై తాప్సీ క్లారిటీ
అప్పుడెప్పుడో విడుదలైన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సీ ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది. దీంతో కోలీవుడ్‌లోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా నిరాశే ఎదురు కావడంతో బాలీవుడ్ చెక్కేసింది. ఇప్పుడు అక్కడ బిజీ హీరోయిన్స్‌లో ఒకరిగా మారింది. ఎక్కువగా మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది తాప్సీ. అయితే ఈ అమ్మడు డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. …
Read More »అందమున్న కల్సి రావడంలేదుగా
యువహీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కి లక్కు లేనట్టేనా..? అని కామెంట్స్ వినిపిస్తున్నాయట. అందుకు కారణం ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ టాక్ దగ్గర ఆగిపోవడమే. ‘ఒరు అదార్ లవ్’ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె, సినిమాకి ముందు విడుదలైన చిన్న వీడియో బైట్‌తో సునామీ సృష్ఠించింది. తీరా సినిమా రిలీజయ్యాక చూస్తే సీన్ రివర్స్‌లో కనిపించింది. వచ్చిన హైప్ ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది. ఏదో అదృష్టం కొద్ది …
Read More »