Breaking News
Home / MOVIES / అందమున్న కల్సి రావడంలేదుగా

అందమున్న కల్సి రావడంలేదుగా

యువహీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కి లక్కు లేనట్టేనా..? అని కామెంట్స్ వినిపిస్తున్నాయట. అందుకు కారణం ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ టాక్ దగ్గర ఆగిపోవడమే. ‘ఒరు అదార్ లవ్’ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె, సినిమాకి ముందు విడుదలైన చిన్న వీడియో బైట్‌తో సునామీ సృష్ఠించింది.

తీరా సినిమా రిలీజయ్యాక చూస్తే సీన్ రివర్స్‌లో కనిపించింది. వచ్చిన హైప్ ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది. ఏదో అదృష్టం కొద్ది యూత్‌స్టార్ నితిన్ సరసన ‘చెక్’ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడటంతో అమ్మడి కెరీర్ డైలమాలో పడింది. ప్రస్తుతం ఈమె నటించిన ‘ఇష్క్’ రిలీజ్ కావాల్సి ఉంది. ఇది తప్ప మరో తెలుగు సినిమా చేతిలో లేదని సమాచారం. ఈ లెక్కన చూస్తే టాలీవుడ్‌లో లక్కు లేనట్టే మాట నిజమనుకోవాల్సిందే.