Home / Tag Archives: film news (page 2)

Tag Archives: film news

దీపికా పదుకొణెకి కరోనా

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కరోనా బారినపడింది. తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పుట్టింట్లో ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే దీపిక కుటుంబం మొత్తానికి కరోనా సోకడం వల్ల వారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఆమె తండ్రి, మాజీ షట్లర్ ప్రకాశ్ పదుకొణెకు జ్వరం తగ్గకపోవడం వల్ల ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Read More »

11 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సరికొత్త మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 11 ఏళ్ల తర్వాత సినిమా అనౌన్స్ చేశారు. అఫిషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా.. ఈ చిత్రానికి ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలు మొదలయ్యాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’లో మహేష్ పేరు అదే. ఇప్పుడదే పేరుని ఈ సినిమా టైటిల్గా ఫైనల్ చేసినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

Read More »

హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం

కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను తాను తీసుకుంటానంటూ హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే తనను కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశాడు. అనాథలుగా మారిన పిల్లల వివరాలను [email protected] కు తెలియజేయాల్సిందిగా సందీప్ ట్వీట్ చేశాడు. రెండేళ్ల పాటు వారికి కావలసిన తిండి, చదువు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతానన్నాడు.

Read More »

విద్యార్థి నాయకుడిగా ఎన్టీఆర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో..యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,హిట్ చిత్రాల దర్శకుడు కోరటాల శివ కాంబోలో వస్తున్న మూవీకి సంబంధించి క్రేజీ అప్డేడేట్ వచ్చింది. చిత్ర కథ అంతా విద్యార్థి రాజకీయాల చుట్టూ తిరగనుందట. జూనియర్ ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాలు-విద్యార్థుల భవిష్యత్ అనే కాన్సెప్ట్ మూవీ రానుందట. #NTR30 వర్కింగ్ టైటిల్తో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యుధసుధ ఆర్ట్స్ …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ.. వకీల్ సాబ్కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ పింక్ రీమేక్ గా తెరకెక్కగా.. సీక్వెల్ కొత్త స్టోరీతో రానుందట. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్తో వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా స్త్రీ సంక్షేమంతో పాటు రైతుల చుట్టూ ఈ కథ తిరగనుందని తెలుస్తుంది.

Read More »

సౌందర్యపై బయోపిక్

అలనాటి అందాల తార సౌందర్య జీవితకథను సినిమాగా తెరకెక్కించనున్నారని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. తాజాగా సౌందర్య సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాల్ని ఆవిష్కరిస్తూ ఓ అగ్ర నిర్మాణ సంస్థ త్వరలోనే సినిమాను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు టాలీవుడ్ టాక్. అగ్రహీరోలందరి సరసన నటించి.. తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సౌందర్య పాత్రలో హీరోయిన్గా సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం.

Read More »

పవన్ తో నిత్యామీనన్ రోమాన్స్

మలయాళ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రం తెలుగులో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే! పవన్‌కల్యాణ్‌, రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో పవన్‌కి జోడీగా మొదటి నుంచి సాయి పల్లవి పేరు వినిపించింది. ఆమె తిరస్కరించడంతో ఆ అవకాశం ఇప్పుడు నిత్యామీనన్‌కి దక్కిందని, దాదాపు నిత్యామీనన్‌ కథానాయికగా ఖరారైనట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం. ఆమె …

Read More »

అలా చేయడం ఇష్టముండదు. అయిన తప్పదంటున్న చందమామ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ . అయితే కాజల్ అగర్వాల్‌కి హారర్ జానర్ సినిమాలంటే ఎంతమాత్రం ఇష్టం ఉండదని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది. అయినా హీరోయిన్ అన్నాక అన్ని రకాల పాత్రలు.. జోనర్ సినిమాలు చేయాలి కాబట్టి రీసెంట్‌గా తనకి ఇష్టం లేని హారర్ జోనర్‌లో ఓ వెబ్ సిరీస్ చేసింది. ‘లైవ్ లైవ్’ టెలికాస్ట్ పేరుతో రూపొందిన ఈ …

Read More »

నీతో మాట్లాడాలంటూ గదిలోకి లాక్కెళ్లి – ఎమ్మెస్ నారాయణపై నటి పద్మజయంతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్‌ నటి పద్మ జయంతి.. దివంగత హాస్యనటుడు ఎమ్మెస్‌ నారాయణపై సంచలన కామెంట్స్‌ చేశారు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన పద్మ జయంతి.. అప్పటి విషయాల గురించి చెబుతూ.. కమెడియన్‌ ఎమ్మెస్‌ నారాయణ తన పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో నటి పద్మ జయంతి …

Read More »

అభిమానులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన హాట్ బ్యూటీ

కరోనా బారిన పడిన పూజాహెగ్డే ఇలాంటి సందర్భంలో ఊహించని విధంగా ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు అభిమానులు ఆశ్చర్యపోయారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన హాట్‌ పిక్‌ నెట్టింట్లో వైరలవుతోంది. ఇందులో పూజా పొట్టి నిక్కరు పైన జాకెట్‌ గుండీలు పెట్టకుండా వదిలేసి పై ఎద అందాలు కనపడీ కనపడకుండా ఉండేలా హాట్‌లుక్‌లో దర్శనమిచ్చారు. కరోనా బారిన పడటంతో ఇంటికే పరిమితమైనా సామాజిక మాధ్యమాల్లో మాత్రం పూజాహెగ్డే హవా తగ్గటం లేదంటున్నారు …

Read More »