కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ డైరెక్టర్, నటుడు శంకరన్ (93) వృద్ధాప్య సమస్యలతో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు.
ఆయన మరణం తనను బాధిస్తోందని ప్రముఖ డైరెక్టర్ భారతి రాజా ట్వీట్ చేశారు. శంకరన్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. కాగా, ఆయన 8 చిత్రాలకు దర్శకత్వం వహించారు.. దాదాపు 30 చిత్రాల్లో నటించారు. కార్తీక్, రేవతి జంటగా నటించిన మౌన రాగం సినిమాలో హీరోయిన్ తండ్రిగా కీలక పాత్ర పోషించారు.