తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేత… దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాద్ మహానగరంలోని అబిడ్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ ఆఫీసులో విడుదల చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన …
Read More »Mp టీజీ వెంకటేష్ పై కేసు నమోదు..?
ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అతని సోదరుడు విశ్వ ప్రసాద్ పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ లో కేసు నమోదైంది. నగరంలోని బంజారాహీల్స్ రోడ్ నెంబర్ పదిలో ఉన్న అర్ధ ఎకరం తమదేనంటూ ఆధీనంలో తీసుకునేందుకు దాదాపు తొంబై మంది అక్కడకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకెళ్లి దొరికిన అరవై మూడు మందిని అరెస్ట్ చేసి కోర్టుకు …
Read More »టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ నాయకుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నల్లజర్ల పోలీసులు ఈ రోజు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆరా తీశారు. స్వయంగా అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు సూచించగా ఇంట్లో లేరని …
Read More »ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై సంచలన తీర్పు
ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దంపతులు, వారి కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మి వేసిన గృహ హింస కేసు రుజువైంది. దీంతో ఆమెకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే పిటిషనరు, ఆమె కుమార్తెకు ప్రతివాదుల ఇంటిలో నివాస వసతి కల్పించాలని స్పష్టం చేసింది. లేదంటే నెలకు రూ. 50వేలు చెల్లించాలని పేర్కొంది.
Read More »కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై విజయనగరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో.. శంకుస్థాపన కార్యక్రమానికి, విధులకు ఆటంకం కలిగించారని ఆలయ EO ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 473 33 సెక్షన్ల కింద అశోక్ గజపతిరాజుపై కేసు నమోదైంది. నిన్న రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు, మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Read More »కంగనా రనౌత్ పై మరో కేసు నమోదు
బాలీవుడ్ నటి.. ఎప్పుడు వివాదంలో ఉండే కంగన రనౌత్ పై మరోసారి కేసు నమోదైంది. రైతుల ఉద్యమాన్ని ‘ఖలీస్థానీ మూమెంట్’ తో పోలుస్తూ ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆమెపై ఫిర్యాదు చేసింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీసులు సెక్షన్ 295A(ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను అవమానించడం) కింద కంగనపై కేసు నమోదు చేశారు.
Read More »మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. సీఎం జగన్, పలువురు మంత్రులపై అసభ్య పదజాలంతో విమర్శలు చేశారంటూ గుంటూరు జిల్లా నకరికల్లు(మ) కండ్లగుంట మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రులను ఉద్దేశించి పరుష పదజాలంతో అయ్యన్న వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫిర్యాదులో కోటేశ్వరరావు పేర్కొన్నారు.
Read More »పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన నటుడు కృష్ణడు
ప్రముఖ సినీ నటుడు కృష్ణడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టాడు. శుక్రవారం రాత్రి మియాపూర్‌లోని ఓ విల్లాపై ఎస్వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడు పేకాట ఆడుతూ చిక్కాడు. ఆయనతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్‌లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కృష్ణుడు పేకాట నిర్వహిస్తున్నాడని సమాచారం. పేకాటరాయుళ్లను మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, నిందితులను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు …
Read More »డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్
డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఆయన నివాసంపై ముందస్తు సమాచారంతో శనివారం ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయన ఇంట్లో డ్రగ్స్ లభించినట్లు వారు పేర్కొన్నారు. కాగా, అర్మాన్‌ను ఏసీబీ కార్యాలయంలో విచారించనున్నట్లు వారు పేర్కొన్నారు. అర్మాన్ కోహ్లీ ఇంటికి ఎన్సీబీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించిన, ఆయనను అరెస్ట్ చేసిన ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు …
Read More »తమిళ హీరో ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు
తమిళ హీరో ఆర్య తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. దీనిపై పోలీసులు ఆరా తీశారు. విషయానికొస్తే… శ్రీలంకకు చెందిన విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు …
Read More »