Home / MOVIES / పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన నటుడు కృష్ణడు

పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన నటుడు కృష్ణడు

 ప్రముఖ సినీ నటుడు కృష్ణడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టాడు. శుక్రవారం రాత్రి మియాపూర్‌లోని ఓ విల్లాపై ఎస్వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడు పేకాట ఆడుతూ చిక్కాడు.

ఆయనతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్‌లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కృష్ణుడు పేకాట నిర్వహిస్తున్నాడని సమాచారం.

పేకాటరాయుళ్లను మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, నిందితులను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు విడిచిపెట్టారు. శనివారం సాయంత్రం విచారణకు రావాలని ఆదేశించారు. కృష్ణుడు వినాయకుడు సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.