కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై విజయనగరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో.. శంకుస్థాపన కార్యక్రమానికి, విధులకు ఆటంకం కలిగించారని ఆలయ EO ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో 473 33 సెక్షన్ల కింద అశోక్ గజపతిరాజుపై కేసు నమోదైంది. నిన్న రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు, మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.