Home / Tag Archives: hyderabad (page 13)

Tag Archives: hyderabad

కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ దమ్మున్న సవాల్

కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో  పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై,సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు కూడా చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో …

Read More »

తగ్గేదేలే.. వెహికల్‌ ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన క్రేజ్‌!

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల కోసం నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలానికి భారీ స్పందన వచ్చింది. తమకు నచ్చిన నంబర్‌ కోసం భారీ మొత్తంలో వెచ్చించేందుకు వెహికల్‌ ఓనర్లు ఏ మాత్రం వెనుకాడలేదు. TS 09 FV 9999 నంబర్‌ కోసం రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి పోటీపడి రూ.4,49,999 లక్షలు వెచ్చించి దాన్ని సొంతం చేసుకున్నారు. TS 09 FW 0001 నంబర్‌ కోసం శ్రీనిధి ఎస్టేట్స్‌ సంస్థ …

Read More »

యాదాద్రి జిల్లాలో కుళ్లిపోయిన స్థితిలో యువతీ యువకుల డెడ్‌బాడీలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తుతెలియని యువతీ యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి డెడ్‌బాడీలను అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించారు. అవి కుళ్లిపోయిన స్థితితో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. పోలీసులు క్లూస్‌ టీమ్‌తో అక్కడికి చేరుకుని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సమీపంలో దొరికిన బ్యాగ్‌లోని వివరాల ఆధారంగా మృతులను హైదరాబాద్‌ నగర …

Read More »

అద్దెకు ఇల్లు చూస్తామని వెళ్లి.. లోపల పనికానిచ్చేశారు!

ఇల్లు అద్దెకు కావాలంటూ వెళ్లిన ఓ జంట చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అద్దెకు ఉండేందుకు ఇల్లు చూస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువతీ యువకుడు సరస సల్లాపాలతో ఆ ఇంటి యజమానికి అడ్డంగా దొరికేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ వద్ద చోటుచేసుకుంది. బైక్‌పై ఓ ఇంటి వద్దకు వెళ్లిన యువతీ యువకుడు యజమానితో మాట్లాడారు. తాము భార్యాభర్తలమని.. అద్దెకు ఇల్లు చూస్తామని చెబితే యజమాని ఓకే అన్నాడు. …

Read More »

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌ పరిధిలోని ఎంఎంటీఎస్‌ రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. రైలు ఛార్జీలను తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 5 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఫలక్‌నుమా- సికింద్రాబాద్‌, హైదరాబాద్‌- లింగంపల్లి-రామచంద్రాపురం మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ తగ్గింపు వర్తిస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన …

Read More »

తెలంగాణకు మూడురోజుల వర్షసూచన

ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్‌ ఇచ్చే వార్త ఇది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు పడతాయని.. పలుచోట్ల ఈదరుగాలులు కూడా వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు ఈనెల 6, 7 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలుందని.. మూడు డిగ్రీల వరకు పెరగొచ్చని …

Read More »

రాహుల్‌ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి

నిరుద్యోగుల మద్దతు ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ కలలు కంటోందని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. హైదరాబాద్‌లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జాబ్‌ నోటిఫికేషన్లు రావడంతో కాంగ్రెస్‌ నేతల్లో భయం పట్టుకుందని.. అందుకే యూనివర్సిటీల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతర్గ కుమ్ములాటలో తెరాసపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. …

Read More »

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ మంత్రి ఆర్కే రోజా కలిశారు. తన కుటుంబంతో కలిసి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. కేసీఆర్‌కు ఆయన ఫొటో ఫ్రేమ్‌ను జ్ఞాపికగా రోజా అందజేశారు. అంతకుముందు రోజాకు సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత స్వాగతం పలికారు. భర్త సెల్వమణి, కుమార్తె, కుమారుడితో కలిసి …

Read More »

గూగుల్‌తో ఒప్పందం.. మరింత మెరుగైన సేవలకు అవకాశం: కేటీఆర్‌

అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్‌కు గూగుల్‌ సంస్థ శ్రీకారం చుట్టింది. అమెరికాలోని మౌంటెన్‌వ్యూలోని తమ హెడ్‌క్వార్టర్‌ తర్వాత హైదరాబాద్‌లో 3.3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను స్థాపించనుంది. ఈ క్యాంపస్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, గూగుల్‌ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. విద్య, పౌరసేవలతో పాటు ఇతర రంగాల్లో గూగుల్‌ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి టెక్నికల్‌ …

Read More »

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. ఉక్కపోత నుంచి కాస్త రిలీఫ్‌

ఎండల వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్‌ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. నగరంతో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్‌, ఈస్ట్‌ మారేడ్‌పల్లి, వెస్ట్‌ మారేడ్‌పల్లి,తిరుమలగిరి, అల్వాల్‌, బోయిన్‌పల్లి, చిలకలగూడ,బేగంపేట్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, గోల్కొడ ప్రాంతాల్లో వర్షం పడింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, కవాడిగూడ, విద్యానగర్‌, భోలక్‌పూర్‌, బీఆర్కే భవన్‌, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, హిమాయత్‌నగర్‌ మొదలైన చోట్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat