తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ జీడిమెట్ల ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తన నివాసం వద్ద అగ్నిమాపక అధికారులు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది సేవలు అనిర్వచనీయమని అన్నారు. అగ్ని …
Read More »GHMCలో 487 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర పరిధి GHMCలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 487 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 86,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు …
Read More »హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్-అమెరికా తర్వాత అతి పెద్ద ఆఫీస్
హైదరాబాద్‌లో మరో బహుళజాతి కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ)ను బుధవారం నానక్‌రామ్‌గూడలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. అమెరికాకు బయట మెడ్‌ట్రానిక్ సంస్థ ఏర్పాటుచేసిన అతి పెద్ద ఇన్నోవేషన్ సెంటర్ ఇదే కావటం విశేషం. హైదరాబాద్ సెంటర్‌లో 160 మిలియన్ డాలర్ల (రూ.1200 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. రానున్న ఐదేండ్లలో దాదాపు వెయ్యిమందికి ఈ సెంటర్‌లో …
Read More »మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన : మంత్రి కేటీఆర్
నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ ట్రానిక్.. రూ. 1200 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్, ఆవిష్కరణలు చేయనుంది. దీనిద్వారా హెల్త్‌కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్ పనిచేస్తున్నది. ఈ సంస్థ …
Read More »సంక్షేమ సంఘాలు కాలనీల అభివృద్ధికి దోహదపడాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద సభ్యులందరూ మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాలనీ అభివృద్ధికి తన పూర్తి …
Read More »మంత్రి మల్లారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు…
ఇటీవలే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన అంతర్రాష్ట్రీయ కబడ్డీ పోటీలను జిల్లా మంత్రి మల్లారెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి గారు గాయపడగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీలు నవీన్ రావు గారు, శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ గారు, మాధవరం కృష్ణా రావు గారు మంత్రి మల్లారెడ్డి గారిని బోయిన్ పల్లి లోని తన నివాసం వద్ద కలిసి పరామర్శించారు.
Read More »హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ వేగవంతం
హైదరాబాద్‌లో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోలో వాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల వద్ద వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్ వేయనున్నారు. 80 లక్షల మంది 45 ఏళ్ళుపై బడిన వారు ఉన్నట్టు ఆరోగ్య శాఖ గుర్తించింది.
Read More »పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల 3న జరగనుంది. హైదరాబాద్ యూసూడలోని పోలీసు బెటాలియన్ మైదానంలో ఈ ఈవెంట్ ను యూనిట్ నిర్వహించనుంది. ఈ వేడుకకు భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులను నిర్వాకులు అనుమతి కోరారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రీ-రిలీజ్ వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం
Read More »తగ్గిన బంగారం ధరలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.45,930కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.42,100గా ఉంది. ఇక వెండి కేజీపై రూ.1000 తగ్గి రూ.71,500గా ఉంది
Read More »మళ్లీ పెరిగిన బంగారం ధరలు
తెలంగాణలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.46,040కు చేరింది. ఇక 22 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి రూ.42,200కు చేరింది. ఇక వెండి కేజీపై రూ.900 పెరిగి రూ.72,500గా ఉంది
Read More »