తెలంగాణలో స్వైన్‌ఫ్లూ భయం మొదలైంది.మరోమారు స్వైన్‌ఫ్లూ పంజా విసిరింది.రెండు రోజులుగా చలిగాలులు వీచడంతో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరిస్తుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒక వృద్ధుడు మరణించాడు.మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరల్ జ్వరాలు, డెంగ్యూలాంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. గాంధీ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య రెండ్రోజులుగా గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం.ప్రజలు భయందోనలో ఉన్నారు.
Read More »ప్రముఖ హీరో గెస్ట్‌హౌస్ సీజ్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు.రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రముఖ సినీహీరో ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేశారు.పైగా భూముల్లో సర్వే నంబరు 46లో 84.30 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో వివాదం కొనసాగింది. మూడునెలల కిందట న్యాయస్థానం ఆ భూమి …
Read More »“టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ”
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ కు హోంమంత్రి మహముద్ అలీ, పలువురు మాజీ మంత్రులు, శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, …
Read More »టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ఎస్ దాకా..తెలంగాణ రాజకీయ అస్థిత్వం..!!
“ఇప్పటివరకూ తత్త్వవేత్తలు చేసింది ప్రపంచాన్ని వివరించడం, ఇప్పుడు చేయవలసింది దానిని మార్చటం..” అంటాడు కారల్ మార్క్స్. ‘‘నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట కార్యాచరణ ’’ అనేదే మార్పుకు మూల సూత్రం అంటారాయన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కూడా కారల్ మార్క్స్ చెప్పిన పద్దతిలోనే సాగింది. తెలంగాణ ను కోరుకున్న విప్లవకారులు, ప్రొఫెసర్ జయశంకర్ వంటి తాత్వికులు తెలంగాణ కష్టాలకు కారణాలను వివరించిన్రు..కానీ మార్చే కార్యాచరణకు పూనుకోలేక పోయిన్రు,. సరిగ్గా …
Read More »‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్
* చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. * పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గురుతరమైన బాధ్యతను అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. * తెలంగాణ ప్రజల కేసిఆర్ గారిని తమ గుండెల్లో పెట్టుకున్నారు * రాష్ట్రంలో వచ్చేది శబ్ద విప్లవమే అని ఆనాడే చెప్పిన * టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా మారుస్తాం ఇంతటి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన …
Read More »పెరుగుతున్న సైబర్‌నేరాల సంఖ్య ..అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
రాష్ట్రంలో టెక్నాలజీ వాడకం పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రజల అమాయకత్వం, అత్యాశను ఆసరా చేసుకొని రెచ్చిపోతున్నారు. కాస్త అప్రమత్తంగా ఉంటే తప్పించుకునే వీలున్నా.. అత్యాశ అనే ప్రధాన బలహీనత బాధితుల పాలిట శాపంగా మారుతున్నది. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ.. మోసగాళ్లకు మరో అస్త్రంగా మారుతున్నది. సైబర్‌క్రైమ్‌లపై పోలీసులు, మీడియా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రజల …
Read More »టీఆర్ఎస్ ప్రకటనలో విజయ్ దేవరకొండ..సోషల్ మీడియాలో వైరల్
సంచలన రీతిలో సీట్లను కైవసం చేసుకొని టీఆర్ఎస్ విజయంతో కేసీఆర్ తెలంగాణాకు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ సాధించిన ఈ బ్రహ్మండమైన విజయం గురించి ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చగా మారింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఈ గెలుపు గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ ప్రచారానికి సంబంధించిన ఓప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ హీరో విజయ్ …
Read More »కేసీఆర్ ఆ సమయంలోనే ఎందుకు ప్రమాణస్వీకారం చేస్తున్నారో తెలుసా?
గులాబీ దళపతి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన ప్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు చేసారు.తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పండితులతో చర్చల అనంతరం…. గురువారం ఉదయం సుబ్రమణ్య షష్ఠి మంచి ముహూర్తమేనని అనడంతో రేపు మధ్యాహ్నం 1.30కు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అతి సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ …
Read More »హైదరాబాద్‌కు దక్కిన అరుదైన రికార్డ్ వెనుక కేసీఆర్ ఏం చేశారంటే…
రాష్ట్ర విభజన తర్వాత, సొంత పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆకర్షణీయ విధానాలతో అన్ని రంగాల బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌లో తమ వ్యాపార విస్తరణకు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఎన్నో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల కార్యాలయాలకు హైదరాబాద్ నెలవైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో తన సత్తాను చాటుతుంది. దీనికి సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఘనత ఉన్న సంగతి …
Read More »కూకట్‌పల్లి లోని జూపూడి ప్రభాకర్ ఇంట్లో పోలీసుల సోదాలు
తెలంగాణలో పోలింగ్ సమీపిస్తున్న వేళ.. నోట్ల కట్టలు వరదలా పారుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బుధవారం ఒక్కరోజే పెద్ద ఎత్తున నగదు పట్టుబడటం గమనార్హం. దీంతో నగరంలో నగదు తరలింపు వ్యవహారాలపై అటు పోలీసులు.. ఇటు ఎన్నికల స్పెషల్ టీమ్ డేగ కన్నేసింది. బుధవారం రాత్రి.. నగరంలోని కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఏపీ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఇంట్లో పోలీసుల సోదాలు చేశారు. మరోవైపు.. జూపూడి …
Read More »