టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో పార్శిల్ సేవల ద్వారా ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం రూ. 62.02 కోట్లు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అజయ్ కుమార్ సమాధానం ఇచ్చారు. కార్గో పార్శిల్ సర్వీసులతో కస్టమర్లు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో హోం పికప్, హోం డెలివరీ పార్శిల్ …
Read More »కాంగ్రెస్ MLA భట్టి విక్రమార్కపై CM కేసీఆర్ Fire
కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ కలగజేసుకున్నారు. భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. అది వారి అవగాహన లోపమైనా ఉండాలి. పంచాయతీరాజ్ అని మనం పిలుస్తాం. కేంద్రంలో రూరల్ డెవపల్‌మెంట్ అని పిలుస్తాం. కేంద్రం నుంచి వచ్చే …
Read More »దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతం – మంత్రి కేటీఆర్
చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ మరియు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ గార్లను చేనేత మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీ లోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతి …
Read More »అభివృద్దే మంత్రి “పువ్వాడ” బ్రాండ్
అభివృద్ధి చేయటంలో ఇతరులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ “బ్రాండ్” అంబాసిడర్. 67 ఏళ్లలో ఏ నాయకుడు చేయలేని పనులు 7 ఏళ్లలో చేసి చూపించిన ఏకైక నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నో సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి పనులను ఆయన గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందించారు మౌలిక వసతులు కల్పించడంలో సఫలీకృతులయ్యారు మరియు ప్రజలు దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులను …
Read More »తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ఐదో స్థానంలో తెలంగాణ
తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు. మొత్తం తలసరి వినియోగానికి సంబంధించి దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉందన్నారు. వృద్ధిరేటులో మొదటి స్థానంలో ఉందన్నారు. …
Read More »ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపుపై -మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు.దేశంలోని జిల్లా ఆస్పత్రుల పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ విడుదల చేశారు. …
Read More »వ్యర్థం నుండి విద్యుత్ ఉత్పత్తి సులభతరమే
నగరీకరణ పెరుగుతున్న కొద్దీ వ్యర్థపదార్దాలు ప్రపంచానికి పెను సవాల్ గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి వ్యర్థపదార్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి సులబతరమౌతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనీ పురపాలక సంఘాలలో లభించే వ్యర్థ పదార్థాలనుండి సంప్రదాయేతర ఇంధనం ఉత్పత్తి చేసే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అంటూ శాసన మండలి సభ్యులు ఊళ్ళోల్ల గంగాధర్ గౌడ్,కే. నవీన్ కుమార్ లతో పాటు అలుగుబెల్లి నర్సిరెడ్డి …
Read More »బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు
బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు.. తెల్లారితే వంట గ్యాస్ సిలిండర్ ధర మూడు వేలు పెంచి.. మనవద్ద నుంచే వసూలు చేస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని అంటారని, ఈ కారణంతో మంచి నూనె ధరను కూడా లీటరుకు 300 రూపాయల వరకు పెంచుతారని ఎద్దేవా చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విద్యుత్ కనెక్షన్లు, ఇంటి అనుమతుల …
Read More »తెలంగాణ మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ: మంత్రి సత్యవతి
సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ.. తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మాటల్ని తూటాలుగా మలిచి.. దోపిడీదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకమైందని చెప్పారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు.ఐలమ్మ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన …
Read More »అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడిన తెలంగాణలోని ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను వాయిదావేసి.. విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌చేసింది. అప్పట్లో ఫస్టియర్‌లో 4.35 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న వీరందరికీ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. …
Read More »