కేంద్రంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖలో భారీగా మార్పులు చేసింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన 86 మంది సీనియర్ అధికారులను కేంద్ర ప్రభుత్వం నిన్న సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు సీబీడీటీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆదాయపు పన్ను శాఖలో చీఫ్ కమిషనర్ స్థాయి 86 మంది అధికారులను బదిలీ చేయగా.. పలువురు అధికారులకు పదోన్నతులు ఇచ్చింది.హైదరాబాద్ ఇన్‌వెస్టిగేటింగ్ …
Read More »ప్రమాదంలో 6కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటా ..?
ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా దేశ వ్యాప్తంగా భారతీయులందరూ తమ తమ ఇండ్ల వద్ద జాతీయ పతాకాలు ఎగురవేసిన సంగతి విదితమే.ఈ క్రమంలో జాతీయ జెండాతో దిగిన సెల్ఫీ ఫొటోలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ యావత్ భారతవానికి పిలుపునిచ్చారు..ప్రధాని పిలుపునందుకుని దేశంలో కోట్లాది మంది భారతీయులు తమ …
Read More »సీఎం నితీశ్ కుమార్ కు బీజేపీ షాక్
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార పార్టీ అయిన జేడీయూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో మైత్రిబంధాన్ని తెగదెంపులు చేసుకున్న సంగతి విధితమే. దీంతో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కమలనాథులు తన పాత మిత్రపక్షమైన జేడీయూకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. డయ్యూ డామన్ ప్రాంతంలో జేడీయూకు 17 మంది పంచాయతీ సభ్యులున్నారు. వారిలో 15 మంది కాషాయ కండువాలు కప్పుకున్నారు. మరో వైపు …
Read More »పశ్చిమ బెంగాల్ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు
పశ్చిమబెంగాల్ కి చెందిన అధికార పార్టీ టీఎంసీ నేత.. ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్‌కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్‌సోల్‌లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్‌పై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శి …
Read More »రైల్వే ప్రయాణికులకు బిగ్ షా
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాకిచ్చింది. ఈ ఒక్కరోజే బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో రాకపోకలు జరపాల్సిన మొత్తం 173 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మరమ్మతుల పేరుతో ఏకంగా నూట డెబ్బై మూడు రైళ్లను రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వీటితో పాటు మరో ముప్పైదు రైళ్ల గమ్యస్థానాల స్టేషన్లను మారుస్తూ రైల్వే …
Read More »రేపే జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష
జార్ఖండ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే బొగ్గుగనులను కేటాయించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించి ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌కు సూచించిన సంగతి విదితమే. అయితే ఈ నేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్ సస్పెన్షన్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. విశ్వాస పరీక్ష సిద్ధమయ్యారు. రేపు …
Read More »కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ , కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరహాలో బీహార్ రాష్ట్రంలోనూ మసీదులు, మదర్సాలపై సర్వే చేయాలని గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బీహార్ రాష్ట్రంలోని సీమాంచల్ రీజియన్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న మసీదులు, మదరసాలు ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో ఎవరు నివాసముంటున్నారు? అనే సమాచారం …
Read More »కామారెడ్డిలో మంత్రి నిర్మలా సీతారామన్
తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం బాన్సువాడకు చేరుకున్న కేంద్రమంత్రి మండలంలోని కొయ్యగుట్ట అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఆపై బాన్సువాడ పట్టణంలోని బీజేపీ కార్యకర్త తుప్తి ప్రసాద్ ఇంట్లో నిర్మల సీతారామన్ అల్పాహారం చేశారు. లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్రమంత్రి పర్యటిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో రేషన్ …
Read More »రైల్వే ప్రయాణికులకు షాక్
మీరు ఎక్కువగా రైల్వేలో ప్రయాణిస్తున్నారా..?. మీకు రైల్ లో ప్రయాణించకపోతే అసలు జర్నీ చేసినట్లే ఉండదా..?. తరచుగా రైల్ టికెట్లను బుక్ చేసుకుని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకుంటున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే . రైల్వే టికెట్ ,హోటల్ గది బుకింగ్ రద్దు చేసుకుంటే ఇప్పటికే అమలుల్లో ఉన్న క్యాన్సిలేషన్ చార్జీలతో పాటు ఇక నుండి వస్తు సేవల పన్ను అదే అండి జీఎస్టీ …
Read More »మరో తెలంగాణ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంచార పశువైద్య సేవలను దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలియజేశారు.ఇందుకోసం 4500 వాహనాలను అందుబాటులోకి …
Read More »