Home / NATIONAL / రేపే జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష

రేపే జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష

 జార్ఖండ్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే బొగ్గుగనులను కేటాయించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించి ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌కు సూచించిన సంగతి విదితమే.

అయితే ఈ నేపథ్యంలో  సీఎం హేమంత్‌ సోరెన్‌   సస్పెన్షన్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. విశ్వాస పరీక్ష సిద్ధమయ్యారు. రేపు సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో తన ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా తన ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని నిరూపించుకోనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుందని, ఈ సందర్భంగా సభలో సీఎం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారని పేర్కొన్నారు. 

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat